పురస్కారాన్ని తిరస్కరించిన హిందూ రచయిత

డాక్టర్ అగ్నిశేఖర్

డాక్టర్ అగ్నిశేఖర్ కాశ్మీరు పండిత వంశానికి చెందిన ఒక ప్రముఖ రచయిత, మేధావి. అయన ఇటీవల ఒక విలేఖరుల సమావేశంలో చెప్పిన విషయం ప్రకారం "జమ్మూ కాశ్మీరు రాష్ట్ర అకాడమీ డాక్టర్ అగ్నిశేఖర్ రచించిన పుస్తకానికి 'ఉత్తమ పుస్తకం' పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారంతో బాటు రూ.51 వేల నగదు పారితోషికం, జ్ఞాపిక, శాలువా సత్కారం లభిస్తాయి." ఐతే డాక్టర్ అగ్నిశేఖర్ ఈ పురస్కారాన్ని స్వీకరించటానికి తిరస్కరించారు. కారణం వారి మాటల్లోనే విందాం -"కాశ్మీరు రాష్ట్రంలో లౌకిక వాదం బొత్తిగా లేదు. కాశ్మీరీ పండితులు అందరూ కూడా కాశ్మీరు నుండి గెంటివేయబడ్డారు. ఒమర్ అబ్దుల్లా నాయకత్వంలోని ప్రభుత్వం తీవ్ర వాదుల ఆగడాలను బహిరంగంగానే సమర్ధిస్తున్నది. ఒమర్ అబ్దుల్లా అధ్యక్షుడుగా ఉన్న అకాడమీ ఇచ్చే ఈ పురస్కారాన్ని స్వీకరించాదానికి నా మనస్సాక్షి అంగీకరించదు. కాబట్టి తిరస్కరిస్తున్నాను. 

- ధర్మపాలుడు