అమెరికాలో హిందూ ఐక్యతా దినోత్సవం


భారత - అమెరికా మేధావుల వేదిక (IAIF) ఆధ్వర్యంలో జూలై 21, 2012 న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 18వ వార్షిక హిందూ ఐక్యతా దినోత్సవం వైభవంగా జరిగింది. వేదిక అధ్యక్షుడు శ్రీ నారాయణ కటారియా నిర్వహణలో జరిగిన ఈ ఉత్సవానికి విదేశాలలో ఉంటున్న కెనడా, ఆస్ట్రేలియా, ట్రినిడాడ్, జపాన్ ఇంకా ఇతర దేశాల నుండి వేల సంఖ్యలో ఉపస్థితులయ్యారు. డాక్టర్ సుబ్రమణ్యస్వామి (జనతా పార్టీ అధ్యక్షుడు) ప్రధాన వక్తగా ఏకబిగిన ఒక గంట సేపు ప్రసంగించారు. వారి ఉపన్యాసంలో కొన్ని విషయాలు ...

1) ప్రపంచ అవినీతిని నిరోధించే శక్తి హిందుత్వానికి మాత్రమే ఉంది.

2) ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని పటాపంచలు చేస్తూ ఉత్తర-దక్షిణ భారత ప్రజలంతా ఒకే జాతి అని డి.ఎన్.ఏ. పరీక్షలు ధృవీకరించాయి.

3) ఉద్యోగ విరమణ చేసిన పది లక్షల మంది సైనికులను కాశ్మీరు పంపండి, కాశ్మీరు సమస్య పరిష్కారం అవుతుంది.


శ్రీ నారాయణ కటారియా మాట్లాడుతూ ఈ ఉత్సవంతో హిందువులు నూతనోత్సాహం పొందారని అన్నారు.
 
- శ్రీ నారాయణ కటారియా పంపిన వార్త 

- ధర్మపాలుడు