మేం ఇప్పటికీ మూల్యం చెల్లిస్తున్నాం

ప్రముఖుల మాట 
 
మహమూద్ అలీ దురానీ
 
ఆఫ్ఘన్ లో సోవియట్లకు వ్యతిరేకంగా అమెరికాతో కలిసి మేం చేసిన యుద్ధంలో మేం (పాకిస్తానీలు) మతాన్ని ఎగదోశాం. దానికిప్పటికీ మూల్యం చెల్లిస్తూనే ఉన్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో, మాకు ఎదురైన పరిస్థితి మాకూ ఎదురైతే ఎలా ఉంటుందో? అని భారతదేశ వ్యవస్థ కూడా ఆలోచిస్తే బాగుంటుంది. అంతమాత్రాన 'అదే కదా మేమూ కోరుకున్నది' అని వెంటనే అనేయకండి. ఎందుకంటే, పెషావర్ ఘటన నేపథ్యంలో 'రండి, కూర్చుని మాట్లాడుకుందాం' అంటూ మీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఇంకా నా చెవిలో గింగిరాలు తిరుగుతూనే ఉన్నాయి.
 
మహమూద్ అలీ దురానీ
గతంలో పాకిస్తాన్ జాతీయ భద్రతాసలహాదారు