ఆదర్శ రాజకీయం

మాణిక్ సర్కారు

మంచి ఎక్కడున్నా ఒప్పుకోవలసిందే మెచ్చుకోవలసిందే. త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి కామ్రెడ్ మాణిక్ సర్కారు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాలుగవసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. రాజకీయ నాయకులకు వేల లక్షల కోట్ల రూపాయలు ఆస్లులున్న ఈ కాలంలో మాణిక్ సర్కార్ ఆస్తులు కేవలం రెండున్నర లక్షల రూపాయలు. వీరికి ఉన్న స్వంత ఇల్లు యొక్క విలువ కూడా ఇందులోనే కలసి ఉన్నది. అయితే వీరి భార్యకు 24 లక్షల రూపాయల ఆస్తి ఉన్నది. ఆమె ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. వీరు చాలా సామాన్య జీవితం గడుపుతారు. ముఖ్యమంత్రి భార్య ప్రభుత్వ వాహనం వాడరు. బజారుకి వెళ్ళాలంటే నడచి గాని, రిక్షాలో గాని వెళతారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. భళా మాణిక్యం.

- ధర్మపాలుడు