వేదాలు వల్లిస్తున్న దెయ్యాలు


ఒకప్పడు రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరుబడ్డ దేశం ఇంగ్లాండు. దాని రాజధాని లండన్. లండన్ నడిబొడ్డున ఉన్న పాఠశాల సెయింట్ జేమ్స్ ఇండిపెండెంట్ స్కూలు. సంపన్నులు చదువుకునే ఈ పాఠశాలలో మాథ్యమిక తరగతుల విద్యార్థులు సంస్కృత భాష చదవడం తప్పనిసరం. అనగా Compulsory Language. ఎందుకు అని అడిగితే వారిలా చెప్పారు. -"హిందువుల ప్రాచీన భాష అయిన సంస్కృతాన్ని చదివితే అన్ని యూరోప్ భాషలు, గణితం, విజ్ఞానశాస్త్రం తదితర అంశాలు చక్కగా నేర్చుకోవచ్చు. సంస్కృతం ద్వారా సమీకృత జ్ఞానం లభిస్తుంది".

ఈ విషయాలన్నీ ఇంగ్లండు వారికి ఎలా తెలిశాయంటారా? 12 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిశోధన చేసి తెలుసుకున్నారట. ఔరా! మీరే కదా సంస్కృతాన్ని 'మృత భాష' అన్నారు!

- ధర్మపాలుడు