మతమార్పిడులు ఇక సాగవు..

 
రెండువేల సంవత్సరాలకు పూర్వం యావత్ ప్రపంచంలో హిందూధర్మమే ఉండేది. కాని నేటి పరిస్థితి చూస్తే మనదేశంలోనే హిందువుల గతి ప్రమాదకరంగా రూపొందింది. మహమ్మదీయుల అకృత్యాలకు తోడు కిరస్తానం వారి మతమార్పిడి కుట్రలతో హిందువుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. అయితే గత 90 సంవత్సరాల నుండి ఏకదీక్షతో చేసిన కృషి ఫలితంగా ధర్మానికి మంచికాలం వస్తున్నది. 
 
బిహార్ రాష్ట్రం జహానాబాద్ లో మాధవనగర్ ఒక చిన్న ప్రాంతం. ఇక్కడ కమలేశ్ అనే ఒక పాస్టరు తన ఇంటికి క్రైస్తవ భవనం అని పేరు పెట్టి ప్రార్థనల పేరుతో అక్కడి పేద హిందువులను మతం మారుస్తున్నాడు. ఇది కనిపెట్టిన బజరంగ్ దళ్, విశ్వహిందూపరిషత్ కార్యకర్తలు 50 మంది క్రైస్తవ భవనాన్ని ముట్టడించి పాస్టరు గుట్టు రట్టు చేసారు. మతమార్పిడి ఉచ్చులో ఇరుక్కున్న అమాయక హిందువులను రక్షించారు. జహానాబాద్ పోలీస్ సూపరింటెండెంటు అనసూయరామ్ సింగ్ బజరంగ్ దళ్ కార్యకర్తలపై కేసు పెట్టి ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ చర్యను వ్యతిరేకించిన స్థానికులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించటమే కాకుండా 83వ నెంబరు జాతీయ రహదారిపై కూర్చుని రహదారి దిగ్బంధనం చేశారు.
విశ్వహిందూపరిషత్, బజరంగ్ దళ్ ల ప్రయత్నాల కారణంగా మతమార్పిడి చర్యలు చాలావరకు తగ్గాయి. ఇప్పుడు ఘర్ వాపసీ కార్యక్రమాల ద్వారా అన్యమతాల నుండి హిందువులు తిరిగి మాతృ ఒడిలోకి వస్తున్నారు.
 
- ధర్మపాలుడు