దళిత కాలనీలో పరిపూర్ణానంద స్వామి పర్యటన


దేవుడి ముందు అందరూ సమానమేనని, మనుష్యులుగా జీవించాలని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి బోధించారు. ఆగష్టు 13వ తేదీన పరిపూర్ణానంద స్వామి కర్నూలు జిల్లా జోహరాపురం గ్రామంలో పర్యటించారు. ఈ గ్రామంలో హరిజనుల ఆలయప్రవేశాన్ని ఇతరులు అడ్డుకొన్న సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో స్వామి ఆ గ్రామంలో పర్యటించి హరిజనుల ఆలయ ప్రవేశాన్ని అడ్డుకోవడాన్ని ఖండించారు. దేవుడి ముందు అందరూ సమానమేనని, ఇటువంటివి పునరావృతం కాకూడదని పిలుపునిచ్చారు. హరిజునుల కాలనీలో ఉన్న కర్రేమ్మవ్వ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అందరికీ తీర్థ ప్రసాదాలు పంచారు.