నిందించుట తగదు

ఏరిన ముత్యాలు - పద్యాలు
కుమార శతకము
 

అవయవ హీనుని, సౌంద
ర్య విహీను, దరిద్రు, విద్యరాని యతని, సం
స్తవనీయు, దేవు, శృతులన్
భువి నిందింపదగదండ్రు బుధులు కుమారా !


భావం : ఓ కుమారా! 'ఈ లోకంలో అంగవికలుణ్ణి, అందవిహీనుణ్ణి, దరిద్రుని, చదువురానివాడిని, గౌరవించదగినవాడిని, భగవంతుడిని, వేదములను నిందిచుట తగదు' అని సజ్జనులు చెబుతున్నారు.