స్వామి వివేకానంద కలలను సాకారం చేద్దాం

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న శ్రీ కణ్ణన్ (అఖిల భారత ప్రధాన కార్యదర్శి, ఆర్.ఎస్.ఎస్.)

2012 నవంబరు 19న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ICSSR హాలులో స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవ ప్రాంత కమిటీ ప్రకటన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివేకానంద శిలాస్మారకం (కన్యాకుమారి) కోశాధికారి శ్రీ హనుమంతరావు కేంద్రకమిటీ సభ్యులను పరిచయం చేశారు. "పూజ్య మాతా అమృతానందమయి గౌరవ అధ్యక్షులుగా, శ్రీ సుభాష్ కాశ్యప్ (మాజీ సెక్రటరీ జనరల్, లోక్ సభ) కార్యాధ్యక్షులుగా, ఇంకా అనేకమంది ప్రముఖులతో కేంద్రకమిటీ ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్ నుండి శ్రీ రామచంద్రమూర్తి (హన్స్, హెచ్.ఎం. టీవి), జస్టిస్ సి.వి.రాములు కమిటీ సభ్యులుగా ఉన్నారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ప్రాంత కమిటీని కూడా శ్రీ హనుమంతరావు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మార్గదర్శక సమితిలో శ్రీ సద్గురు శివానందమూర్తి, శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి (కుర్తాళం), శ్రీ విద్యారణ్యభారతి స్వామి (హంపి) మొదలైన సాధుసంతులున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రాంత కమిటీని ప్రకటిస్తున్న శ్రీ హనుమంతరావు,  కోశాధికారి, శిలాస్మారకం (కన్యాకుమారి)

ప్రాంత కమిటీ :
  • అధ్యక్షులు - డా.కె.అరవిందరావు (డిజిపి రిటైర్డ్),
  • ఉపాధ్యక్షులు - శ్రీ ఇ.సుందర్ రావు (ఐ.ఎ.ఎస్. రిటైర్డ్), శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి (ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు), శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (నెల్లూరు), శ్రీమతి గొట్టిపాటి సత్యవాణి, డా.రామకృష్ణారెడ్డి (నంద్యాల),
  • ప్రధాన కార్యదర్శి - డా. చామర్తి ఉమామహేశ్వరరావు (ఐ.ఎ.ఎస్. రిటైర్డ్).

వీరు కాక కార్యదర్శులు, సభ్యులు మొదలైనవారిని ప్రకటించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ కణ్ణన్ (అఖిల భారత ప్రధాన కార్యదర్శి, ఆర్.ఎస్.ఎస్.) మాట్లాడుతూ "వివేకానందుడు ఈ దేశం గురించి చెప్పిన విషయాలను సమాజంలోని అందరికి వివరిద్దాం, స్వామి వివేకానందుని కలలను సాకారం చేద్దా"మని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులైన శ్రీ టి.ఎస్.రావు కూడా పాల్గొన్నారు.