భారత టైటానియం సామర్ధ్యం

టైటానియం
 
ఇంతింతై వటుడింతై అన్నట్లు భారతదేశం విజ్ఙాన-సాంకేతిక రంగాలలో పై పైకి దూసుకుపోతున్నది. అంతరిక్ష పరిశోధన, అణుసామర్ధ్యంలో విజయం సాధించినట్లే. ఇప్పుడు 'టైటానియం' లోహాన్ని స్వంతంగా రూపొందించుకుంటున్నది. చేతి గడియారం మొదలు అంతరిక్ష వాహనాల వరకు వివిధ వస్తువుల పరికరాలలో కీలకమైన లోహం టైటానియం. ఇంతకాలం మనం ఈ లోహం కోసం విదేశాలపై ఆధారపడేవాళ్లం. రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ.) రక్షణ ధాతు విజ్ఙాన పరిశోధన సంస్థలు టైటానియం స్వంతంగా రూపొందించుకునే పరిజ్ఞానాన్ని కనిపెట్టాయి. ఇప్పటి వరకు అమెరికా, చైనా, జపాన్, రష్యాలు మాత్రమే ఈ శక్తి కలిగి ఉన్నాయి. మనం రూపొందించే టైటానియం వంద సంవత్సరాలైనా నశించదు.
 
- ధర్మపాలుడు