కిస్ ఆఫ్ లవ్ ఒక అనాగరిక చర్య

కర్నాటక రాష్ట్ర మహిళా కమిషన్ చెయిర్ పర్సన్ శ్రీమతి మంజుల
 
ఇటీవల ఆధునికత పేరుతో విశృంఖలత్వం పెరిగి వెఱ్ఱితలలు వేస్తోంది. చాలాకాలం వాలెంటైన్ పేరుతో వెకిలిచేష్టలు చేసినవారు ఇప్పుడు బహిరంగంగా 'చుంబన' కార్యక్రమం చేపట్టి చెలరేగిపోతున్నారు. ఐతే ఇప్పుడిప్పుడే సమాజం కళ్ళు తెరచి వాస్తవాలను గ్రహిస్తున్నది. కర్నాటక రాష్ట్ర మహిళా కమిషన్ చెయిర్ పర్సన్ శ్రీమతి మంజుల ఈ కార్యక్రమాన్ని ఖండిస్తూ ఇది ఒక అనాగరికమైన ఆలోచన అని తీవ్రంగా విమర్శించారు. ఆంతరంగికశాఖ మంత్రి కె.జె.జార్జి ఈ కార్యక్రమాన్ని ఒక బూతుచర్యగా అభివర్ణించారు. కేంద్ర డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్, కిస్ ఆఫ్ లవ్ వంటి వాటికి అనుమతి లేదన్నారు. ఇటువంటి సంస్కార రహిత ఉన్మాదాలను అందరూ ఖండించాలి.
 
- ధర్మపాలుడు