పాపపు పనులు చేయబోకు..!

ఏరిన ముత్యాలు
కుమార శతకము

 
 

పాపపు పని మదిని దలపకు
చేపట్టిన వారి విడువచేయకు, కీడున్
లోపల తలపకు, క్రూరుల
ప్రాపును మరి నమ్మబోకు మహిని కుమారా!
 


భావం : ఓ కుమారా! మనస్సులో చెడు ఆలోచనలను రానీయవద్దు. ఆశ్రయమిచ్చిన వారిని విడిచిపెట్టకు. మనస్సులో ఏమాత్రము వారికి కీడును తలంచవద్దు. దుర్మార్గుల ఆదరణను నమ్మవద్దు.