కామెర్లను తగ్గించే నేల ఉసిరిక

నేల ఉసిరిక మొక్క

నేల ఉసిరిక ఆకులను ముద్దగా నూరి మిరియాల చూర్ణము కలిపి వారం రోజులు ఇచ్చిన కామెర్ల రోగము తగ్గును. కామెర్ల రోగము మరియు లివర్ చికిత్సలో ఈ నేల ఉసిరిక అత్యుత్తమముగా పని చేయునని పరిశోధన పత్రములో తెలిపినారు. నేల ఉసిరికను నీడన ఎండించి పొడి చేసి రోజుకు రెండుసార్లు 5 గ్రాముల చొప్పున తింటే మధుమేహ వ్యాధి తగ్గుతుంది. 

నేల ఉసిరిక : ఇది ప్రతి గ్రామమునందు, ప్రతిచోట, ఖాళీస్థలములో  భూమికి సుమారు 1 అడుగు ఎత్తు వరకు పెరుగు మొక్క. ఆకులు చిన్నవిగా, ఉసిరిక ఆకులవలె ఉండును. ఆకులకు క్రింది భాగమున తెల్లని చిన్నపూసల వలె, ఉసిరికకాయల వలె దీని కాయలు ఉండును. అందువల్లనే దీనికి నేల ఉసిరిక అని పేరు వచ్చినది. చలువ చేయును. పిత్త కఫములను తగ్గించును. కామెర్లు రోగమును తగ్గించుటలో ప్రసిద్ధి గాంచిన మూలిక. మధుమేహమును తగ్గించును. మూత్రాశయ రోగములను తగ్గించును. విషాన్ని హరించును. 

నేల ఉసిరిక ఆకులను ముద్దగా నూరి మిరియాల చూర్ణము కలిపి వారం రోజులు ఇచ్చిన కామెర్ల రోగము తగ్గును. కామెర్ల రోగము మరియు లివర్ చికిత్సలో ఈ నేల ఉసిరిక అత్యుత్తమముగా పని చేయునని పరిశోధన పత్రములో తెలిపినారు.

నేల ఉసిరికను నీడన ఎండించి పొడి చేసి రోజుకు రెండుసార్లు 5 గ్రాముల చొప్పున తింటే మధుమేహ వ్యాధి తగ్గుతుంది. 20 మీ.లీ. ఉసిరిక రసంలో చిటికెడు మిరియాల చూర్ణమును కలిపి త్రాగితే స్త్రీలలో కలిగే ఋతుశూల తగ్గుతుంది. చిన్న పిల్లలలో వచ్చు పొంగు, ఆటలమ్మ, విషజ్వరములలో నేల ఉసిరిక రసంలో తేనె కలిపి ఇచ్చిన తగ్గుతాయి. నేల ఉసిరిక రసం, తేనె కలిపి ఇచ్చిన దగ్గు, ఆయాసం తగ్గుతాయి.

డా.పి.బి.ఏ.వేంకటాచార్య