హిందూ తత్త్వం - బౌద్ధం పై సదస్సు


మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో సెప్టెంబర్ 21, 22, 23 తేదీలలో ప్రపంచంలో ప్రాచీనమైన హిందూ, బౌద్ధ మతాలకు సంబంధించిన సదస్సు జరగబోతోంది. ఆ సమావేశాలలో హిందుత్వం చెప్పే ధర్మమూ - బౌద్ధం చెప్పే ధమ్మముల సంబంధం పై, రెండింటి మధ్య స్వభావ - సారూప్యాల గురించి చర్చ జరుగుతుంది. 


ఈ కార్యక్రమానికి 22 దేశాలకు చెందినా అనేకమంది ప్రముఖ తత్వవేత్తలు, మేధావులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు యు.కే., ఫ్రాన్సు, నెదర్లాండ్స్, వియత్నాం, చైనా ఇజ్రాయెల్, ఈజిప్ట్, ఇండోనేషియా, జపాన్ మొదలైన దేశాల నుండి వస్తారు. థాయిలాండ్ మహారాణి మహా చక్రి సిరిమారథాన్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ప్రపంచంలో నేడు తలెత్తుతున్న అనేక సమస్యలను అధిగమించేందుకు హిందుత్వము బౌద్ధం రెండు కలిసి పని చేయవలసిన అవసరం ఉంది. 

- టైమ్స్ ఆఫ్ ఇండియా
 
- రాము