రాబోవు ఎన్నికలలో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదు


ఈ రోజున ప్రపంచమంతా ఇస్లామిక్ ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నది. ముస్లింలందరు ఉగ్రవాదులు కాదు, కాని ఉగ్రవాదులందరు ముస్లింలేనని జరుగుతున్నసంఘటనలను బట్టి అర్థమవుతున్నది.  పాముకు పాలుపోసి పెంచినట్లుగా పాకిస్థాన్ దేశం ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న విషయం అందరికి తెలుసు. అదే ఉగ్రవాద శిక్షణ కారణంగా ఈ రోజున పాకిస్థాన్ అంతర్యుద్ధ పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం కూడా అందరికి తెలుసు.  ఉగ్రవాద మూలాలు ఎక్కడ ఉన్నాయో ప్రపంచమంతటికి తెలుసు. ఆర్.ఎస్.ఎస్., బి.జె.పి.లు తీవ్రవాద శిక్షణనిస్తున్నాయంటూ షిండే మాట్లాడిన మాటలను ఆధారం చేసుకొని పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న పని చేస్తున్న ఉగ్రవాది హసీబ్ సయ్యద్ "భారత ప్రభుత్వం ఆర్.ఎస్.ఎస్.ను నిషేధించాలని పిలుపునిచ్చాడు. ఈ హసీబ్ సయ్యద్ ఎటువంటి వాడంటే అతనిపై కోటి డాలర్ల బహుమానాన్ని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. అటువంటి వాడు భారత్ లోని హిందూ సంస్థలను నిషేధించాలని పిలుపునిస్తున్నాడు. షిండే మాటల వల్ల మన జుట్టును వాడి చేతికి ఇచ్చినట్లయింది. 

వాస్తవాలు గమనించినట్లయితే సంఝౌతా ఎక్స్ ప్రెస్ ప్రేలుళ్ళకు కారకులు అల్ ఖైదా ఉగ్రవాదులని ఐక్యరాజ్యసమితి వెబ్ సైట్ లో ఉన్నాయి. ఇవన్నీ షిండేకు, కాంగ్రెస్ నాయకులకు తెలియదని అని ఎవరైనా అనుకొంటే అది అమాయకత్వమే. 1992  తదుపరి కాంగ్రెస్ ముస్లిం ఓట్ బ్యాంకును క్రమంగా కోల్పోతూ వచ్చింది. దాని కారణంగా సంకీర్ణ ప్రభుత్వం నడుపవలసి వస్తున్నది. కోల్పోయిన ముస్లిం ఓట్ బ్యాంక్ లను తిరిగి సాధించుకొనేందుకు కాంగ్రెస్ చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నంలో భాగమే హిందూ ఉగ్రవాదులకు ఆర్.ఎస్.ఎస్. శిక్షణనిస్తోందని ఆరోపించటం. గడచిన కొద్ది సంవత్సరాలుగా ఈ దిశలో వేట సాగిస్తూ కొద్దిమందిని అదుపులోకి తీసుకొన్నది. అదుపులోకి తీసుకొన్న వారిపై ఇంతవరకు ఒక్క కేసు పెట్టలేదు. ఛార్జిషీట్ కూడా పెట్టలేదు. నేర నిరూపణ కాకముందు నిందితుడు అనుమానితుడు మాత్రమే. అనుమానితులను ఉగ్రవాదులుగా చిత్రీకరించటం కూడా చట్ట వ్యతిరేకమని తెలిసి కూడా తాను అదుపులో తీసుకొన్న వారందరికి సంఘంతో సంబంధం ఉన్నది కాబట్టి సంఘం ఉగ్రవాదులను తయారు చేస్తున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.  ఇటువంటి నీచపు ఎత్తుగడలు ఎల్లకాలం సాగవని కాంగ్రెస్ గుర్తించాలి. 

ఇటువంటి నీచపు ఎత్తుగడలతో అసలైన ఉగ్రవాదులను గాలికి వదిలేస్తున్నట్లుగా ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ఈ మాటలను వెనక్కు తీసుకొని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇటువంటి అసత్య ఆరోపణలతో సంఘాన్ని ఎదుర్కొంటామని ఒకవేళ కాంగ్రెస్ నేతలు అనుకొంటే ఒక్కసారి ఎమర్జన్సీ సమయాన్ని జ్ఙాపకం చేసుకోవాలి. ఆ సమయంలో ప్రజలు కాంగ్రెస్ కు ఎటువంటి గుణపాఠం నేర్పించారో అటువంటి గుణపాఠాన్నే రాబోవు ఎన్నికలలో కూడా ప్రజలు నేర్పిస్తారని కాంగ్రెస్ గుర్తిస్తే మంచిది.

- రాము