నైతిక విలువలు పాఠ్యాంశంగా ఉండాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యం

 
ఈమధ్య ఢిల్లీలో సంతోషిసింగ్ అనే మహిళ సుప్రీంకోర్టులో ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యము దాఖలు చేసింది. సమాజంలో నైతిక విలువలు వేగంగా పడిపోతున్నాయని, జీవితంలో ఏ విధంగానైనా డబ్బు సంపాదించటమే ఏకైక లక్ష్యం అన్న ధోరణి పెరిగిపోతున్నదని, దీనిని ఒక జాతీయ సమస్యగా పరిగణించి ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు నైతిక విలువలు బోధించే పాఠ్యాంశాలు తప్పనిసరి చేయాలని కోరుతూ ఈ వ్యాజ్యము దాఖలు చేయబడింది. 
 
దీనిని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్, న్యాయమూర్తి ఏ.కౌశిక్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విషయంపై సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు, సి.బి.ఎస్.ఇ.కి ఆదేశాలు జారీ చేసింది. మానవ వనరుల మంత్రిత్వశాఖ అభిప్రాయాలు తెలియచేయాలని చెప్పింది. నైతిక విలువల పతనమును అడ్డుకోలేకపోతే మరిన్ని సమస్యలు పెరుగుతాయి. నైతిక విలువలు ఇంట్లో, బడిలో బోధించడం తప్పనిసరి కావాలి. అప్పడే సమాజం ఆరోగ్యవంతంగా ఉండగలుగుతుంది.