సరస్వతీ నమస్తుభ్యం


రామాలయాలు, వేంకటేశ్వర ఆలయాలు దేశంలో చాలా చూస్తుంటాం. మన రాష్ట్రంలో సరస్వతీ దేవి ఆలయం ఒక్క బాసరలో మాత్రమే ఉన్నది. ఐతే ఇప్పుడు పరిస్థితి మారింది. మన రాష్ట్రంలో ఉన్నత విద్య పట్ల అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులలో పెరిగిన ఆసక్తి, శ్రద్ధ కారణంగా చదువుల తల్లి సరస్వతీ దేవి ఆలయాలు వివిధ ప్రాంతాల్లో వెలుస్తున్నాయి. విజయనగరం, నందివనపర్తి, వర్గల్ (మెతుకు జిల్లా), వెంకటాచలం (నెల్లూరు), నిడదవోలు (ప.గో.జిల్లా), పిఠాపురం (తూ.గో.జిల్లా)లలో జ్ఞాన సరస్వతీ ఆలయాలు వెలసి పూజలందుకుంటున్నాయి. ఇది ఇలా ఉండగా కార్పొరేట్ కళాశాలల్లో పాఠశాల ఆవరణలలో కూడా ఆలయాలు నిర్మిస్తున్నారు. ఇవి కాకుండా రాష్ట్రంలోని వివిధ పట్టణాలలో, గ్రామాలలో వందకు పైగా సరస్వతీ దేవి ఆలయాలు ఉన్నట్లు, ఆలయాల సంరక్షణ సమితి నాయకుడు కమలానంద భారతి తెలియచేస్తున్నారు. ఇది చాలా శుభ పరిణామం. 

జై సరస్వతీ మాత. 

- ధర్మపాలుడు