భూమి కోసం స్వామీజీపై నింద

గడచిన 30 సంవత్సరాల నుండి నిరుపేద పిల్లలకు ఆశ్రయం కల్పించి చదువు చెప్పిస్తున్న ఒక స్వామీజీపై 12 సంవత్సరాల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే నిందను మోపి బజారుకీడ్చే ప్రయత్నం ఈ మధ్య విశాఖలోని వెంకోజీపాలెంలో జరిగింది.

దీని వెనుక ఆశ్రమానికి సంబంధించిన కోట్లాది రూపాయల విలువ చేసే 6 ఎకరాల భూమిలో కొంతభాగం కబ్జా చేయాలనే కుట్రదారుల ప్రయత్నం ఉంది. 8 నెలల క్రితమే ఆశ్రమం వదలి వెళ్ళిపోయిన బాలికపై అత్యాచారం చేశారనే నింద మోపి, దాడి చేసి పోలీసులకు అన్యాయంగా అప్పగించారు. తాను ఎటువంటి తప్పూ చేయలేదనీ, అవసరమైతే డి.ఎన్.ఏ. పరీక్షకు సైతం సిద్ధమని స్వామీజీ  ప్రకటించినప్పటికీ, పోలీసులు పట్టించుకోకుండా నిర్బంధించినట్లుగా సమాచారం.

దీనిపై ఆ గ్రామ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక కొన్ని మతతత్వ శక్తులు ఉన్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అక్రమంగా నిర్బంధించిన స్వామీజీని విడుదల చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.