అందరూ ధర్మకార్యంలో పాల్గొనాలి


'మనది సనాతన ధర్మమండీ! దానికి చావులేదు, మనమేం చేయనవసరం లేదు' అని కొందరంటారు. నిజమే! మనది సనాతన ధర్మమే! చచ్చేప్రమాదం లేనంతమాత్రాన ఒంటిచీడ, తలనొప్పి, పిచ్చి, బలహీనత వంటి బాధలకు చికిత్స చేసుకోకుండా కూర్చుంటామా? చిన్న వ్యాధులని వదిలిపెడితే క్రమంగా అవే ప్రాణాంతక స్థితిని తెస్తాయి. కాబట్టి తప్పక చికిత్స చేసుకుంటాం.
 
 
అలాగే ధర్మమునకేర్పడిన జాడ్యాలను కూడా వదిలించాలి. బలాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడు ఆనందంగా జీవించగలం. కాబట్టి ధర్మాన్ని రక్షించుకుందాం. దర్మస్థాపకుడైన భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం. 
 
1) ధర్మాన్ని గురించి తెలుసుకోవడం, 2) ధర్మాన్ని ఆచరించడం, 3) ధర్మం తెలియనివారికి తెలియచెప్పడం, 4) ధర్మానికేర్పడుతున్న సంకట పరిస్థితులను అర్థం చేసుకొని తోటివారికి తెలియచెప్పడం, 5) మన కుటుంబంలో, తోటివారిలో ధర్మాచరణను ప్రోత్సహించటం. 
 
ఈ 5 విషయాలను అనుసరిస్తే ధర్మకార్యం పూర్ణంగా చేసినట్లే. 
 
- ఋషిపీఠం సౌజన్యంతో....