కోరికలను పారద్రోలడంలో బుద్ధుని అష్టాంగమార్గం ఈనాటికీ అనుసరణీయమే

గౌతమ బుద్ధుడు
బెనారస్ దగ్గరున్న సారనాథ్ లో బుద్ధుడు మొట్టమొదటి ధర్మోపదేశం చేశాడు. ఈ ఉపదేశంలో అయన నాలుగు నిజాలు చెప్పాడు.

1) జీవితం దుఃఖమయం, 2) సుఖ సంతోషాల కోసం, సంపద కోసం అరాటపడటం దుఃఖానికి కారణం, 3) ఈ కోరికల్ని త్యజించిన వాడికి దుఃఖం ఉండదు, 4) ఈ దుఃఖాన్ని లేదా బాధను పోగొట్టుకోవడానికి ఎనిమిది మార్గాలున్నాయి. వాటినే అష్టాంగాలంటారు. 

అష్టాంగాలు

1. అవగాహన లేదా నమ్మకం కలిగి ఉండటం. పైన చెప్పిన 'నాలుగు నిజాలను' సరిగ్గా అవగాహన చేసుకోవాలి. 2. సత్ యత్నం ద్వారా భవబంధాలను, ఇష్టా ఇష్టాలను వదిలిపెట్టాలని గాడంగా కోరుకోవడం. 3. సత్ వాక్కుతో ఇతరులను నొప్పించకుండా అబద్ధాలాడకుండా మృదువుగా మాట్లాడడం. 4. సత్ ప్రవర్తన ద్వారా దొంగతనం, హత్య వంటి పనులకు దూరంగా ఉండటం. 5. సత్ జీవనంతో నిజాయితీగా ఉంటూ కష్టపడి పని చేస్తూ జీవించడం, 6. సత్ కర్మతో దుర్లక్షణాలను పోగొట్టుకోవడం, 7. సమ్యకాలోచనతో కోరికలను, అజ్ఞానాన్ని అధిగమించడంపై  దృష్టి సారించడం, 8. సమ్యక్ ధ్యానంతో అశాశ్వతం, అసంపూర్ణత్వాలను అర్థం చేసుకోవడానికి అంతర్ముఖుడు కావడం.

ఈ ఎనిమిది మార్గాలను అనుసరించడం ద్వారా కోరికల్ని మన మనసులోంచి పారదోల వచ్చునని బుద్ధుడు చెప్పాడు. ఈ మార్గం ఈనాటికీ అనుసరణీయమే.