ఆత్మగౌరవాన్ని జాగృతం చేయాలి

హితవచనం
 
పరమ పూజనీయ డా.హెడ్గేవార్
 
భావాలను బట్టే నడత కూడా ఏర్పడుతుంది. కాబట్టి మహత్తంతా భావందే. ఢిల్లీలోని మొగల్ సామ్రాజ్యాలవంటి వందలాది సామ్రాజ్యాలను నేలమట్టం చేసి అలాంటివే వందలాది నూతన సామ్రాజ్యాలను స్థాపించగలిగే శక్తి సామర్ధ్యాలున్న జయసింహ మహరాజ్ మొగలులకు దాసానుదాసుడై ఎందుకున్నాడు? కొద్దిమంది మరాఠాల సహాయంతో స్వరాజ్యస్థాపనకై ప్రయత్నించిన ఛత్రపతి శివాజీ 'హిందూ పదపాదశాహి'ని నిర్మించడంలో సఫలుడు ఎట్లా అయ్యాడు?  
 
మొదటివానిలో ఆత్మగౌరవం అనేది లేకపోవటం, రెండవ వానిలో అది మెండుగా, దివ్యజ్యోతిలా వెలుగుతూ ఉండడమే దీనికి కారణం. నేడు హిందూసమాజంలో నష్టప్రాయంగా కనిపిస్తున్న ఈ ఆత్మగౌరవ భావాన్ని మళ్ళీ జాగృతం చేయడం ఒక చారిత్రక అవసరం.