నాసాలో శిక్షణకు సూర్య వంశి


ప్రతిష్ఠాత్మకమైన అమెరికా అంతరిక్ష విద్యా కార్యక్రమానికి అనుసంధానకర్తగా ప్రప్రథమంగా ఒక భారతీయ ఉపాధ్యాయిని ఎంపికయ్యింది. మహారాష్ట్ర పుణే విద్యావాలీ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయిని శ్రీమతి సూర్యవంశి వందన నాసాలో శిక్షణ కొరకు బయలుదేరుతున్నది. అమెరికా చేపట్టిన రోదసీ విద్యావ్యాప్తి కార్యక్రమం కొరకు అంతర్జాతీయంగా ప్రతిభావంతులను ఎంపిక చేసే క్రమంలో శ్రీమతి వందన మనదేశం నుండి ఎంపికయ్యారు. కొలరాడోలో ఏప్రిల్ 16 నుండి 19 వరకు జరిగే 28వ రోదసీ సదస్సులో వందన పాల్గొంటారు. స్పేస్ ఫౌండేషన్ నిర్వహించే రోదసీ విద్యావ్యాప్తిలో వందన ఒక కీలకమైన అనుసంధానకర్తగా వ్యవహరించబోతున్నారు. 

సాక్షి 1/2/2012 వార్తా ఆధారంగా..

-ధర్మపాలుడు