అమెరికాలో పల్లకి మోత


ఇంట ఈగల మోత - బయట పల్లకి మోత అనే సామెత విన్నారు కదా! హిందువులు భారత దేశంలో రెండో శ్రేణి పౌరులు. కానీ! వారినే అమెరికా నెత్తిన పెట్టుకుంటోంది. ఇటువంటి వార్తలు క్రొత్త కాకపోయినా, నిన్న మొన్న జరిగిన ఒక విషయం చిత్తగించండి. మిత్రదత్తా గువాహాటీ (అస్సాం) డిల్లీ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ చదివిన అనంతరం సిన్ సినాటీ (అమెరికా) విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా అందుకున్నది. ఈమె పరిశోధకురాలిగా, పాలనాధ్యక్షురాలిగా, అధ్యాపకురాలిగా చూపిన ప్రతిభ కారణంగా, చికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా నియమించబడింది.

ఇది ఇలా ఉండగా అంజీ జైన ఇండోరు
విశ్వవిద్యాలయంలో పట్టా అందుకుని, కర్ణావతిలోని భారత మేనేజిమెంటు సంస్థ (ఐ.ఐ.ఎం.) లో ఎం.బి.ఏ. చదివి, కాలిఫోర్నియా (అమెరికా) విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పట్టా పొందారు. వీరు ఎల్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ మేనేజిమెంటులో సీనియర్ అసోసియేట్ డీన్ గా నియమితులైనారు.

అది మన వాళ్ళ ప్రతిభ.


- ఆంధ్రజ్యోతి, 19/06/2012

- ధర్మపాలుడు