ధృతి క్షమా దమోస్తేయం

ధృతి క్షమా దమోస్తేయం 
శౌచ మింద్రియ నిగ్రహః |

ధీర్విద్యా సత్య మక్రోధో 
దశకం ధర్మ లక్షణమ్ ||

భావము : ధృతి, క్షమా, దమము, అస్తేయము (దొంగతనము చేయకుండుట), శుచిత్వము, ఇంద్రియ నిగ్రహము, బుద్ధి, జ్ఞానం, సత్యము, క్రోధము లేకుండుట అను ఈ పదియు ధర్మ లక్షణములనబడును.