నా రూటే వేరు


"ఉలగం పలు విధం - అది లెనా నొరువిదం" అని ఒక అరవ సామెత ఉన్నది. అనగా "ప్రపంచం పది విధాలుగా ఉంటుంది. అందులో నాదొక విధం" అని అర్ధం. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ప్రపంచ దేశాలన్నీ ఒక పద్ధతిలో సాగుతుంటే భారతదేశం "నా రూటే వేరు" అన్న ధోరణిలో సాగుతున్నది. అల్ప సంఖ్యాక వర్గాల వారికి భారతదేశంలో మహారాజ భోగమే. అనుమానమా? అయితే సామియేలు గారి సంగతి చూడండి. జైళ్ళ శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శామ్యూల్ జాన్సన్ ఒక అవినీతిపరుడు. గతంలో జైళ్ళ డైరెక్టర్ జనరల్ గా ఉన్న, లోకేంద్ర శర్మకు లంచం ఇవ్వబోయి ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యాడు. ఈయన మీద హైకోర్టులో క్రిమినల్ కేసు పెండింగులో ఉంది.

సామాన్యంగా ఐతే ఇటువంటి అధికారిని ఉద్యోగం నుండి పూర్తిగా తొలగిస్తారు. కానీ! మన ప్రభుత్వం నిర్వాకం చూడండి, శామ్యూల్ గారు ఉద్యోగ విరమణ చేయడానికి ఒక్క రోజు ముందు ఆయనకు ఇన్స్పెక్టర్ జనరల్ గా ప్రమోషన్ ఇచ్చి సగౌరవంగా సాగనంపారు. ఈయన ఇన్స్పెక్టర్ జనరల్ హోదాలో ఉన్నది కొన్ని గంటలు మాత్రమే. ఐతే ఏమి? ఈ పదోన్నతి కారణంగా ఎన్నోరెట్లు టర్మినల్ బెనిఫిట్లు పెరుగుతాయి. ఉద్యోగ విరమణానంతరం ఎన్నో సౌకర్యాలు ఒనగూడుతాయి. ఇది సెక్యులర్ దేశం అయినప్పటికీ, ఏ పని జరగాలన్నా మత ప్రాతిపదిక పైనే!

జై లౌకికవాదం   

- ఈనాడు, 30/6/2012. 

- ధర్మపాలుడు