ఆహారపు అలవాట్లు - శరీర తీరు తెన్నులు


భగవంతుని సృష్టిలో కోట్ల జీవులున్నాయి. భూమిమీద, నీటిలోనూ, గాలిలోనూ ఉండేవి, నడిచేవి, ప్రాకేవి, ఎగిరేవి, యీదేవి ఈ విధంగా ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. కొన్ని శాకాహారం మాత్రమే తినేవి కాగా కొన్ని మాంసాహారాన్ని మాత్రమే తింటాయి. కొన్నేమో అటు శాకాహారాన్ని, ఇటు మాంసాహారాన్ని కూడా భేషుగ్గా భుజిస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఏ జీవులు మాంసాహారులు?, ఏవి ఇతరులు? అని అడిగితే ఎవరైనా సరిగ్గా వర్గీకరించగలరా? మూడు విధాలుగా ఆహారం తీసుకునే జీవులను పేరుపేరునా చెప్పడం అసాధ్యం. ఏమంటారు? అయితే దీనికొక ఉపాయం ఉంది. ఇన్ని కోట్ల జీవరాశుల తిండి గోల గురించి సూక్ష్మంగా విశదీకరించే పధ్ధతి ఒకటి ఉంది. చూద్దాం రండి: 

1) కాలికి గిట్టలు, తలమీద కొమ్ములు ఉన్న ప్రాణులు, లేదా గిట్టలు మాత్రమే ఉన్నా సరే - అవి శుద్ధ శాకాహారులు. ఉదా : ఆవు, గుర్రం, జింక, ఏనుగు మొదలైనవి.

2) చేతులకూ, కాళ్ళకూ వ్రేళ్ళు ఉండే జీవులు ఏమైనా సరే మాంసాహారాన్ని తింటాయి. వీటిలో కొన్ని మాంసాన్ని మాత్రమే తింటాయి. శాకాహారాన్ని ముట్టవు. ఉదా : సింహం, పులి, తోడేలు, దుమ్మల గొండు మొదలైనవి. 

3) చేతులకూ, కాళ్ళకూ వ్రేళ్ళు ఉన్నప్పటికీ కొన్ని జంతువులు శాకాహారం, మాంసాహారాన్ని కూడా తింటాయి. చేపలకు కాళ్ళూ, వ్రేళ్ళూ ఉండవు.  కానీ గిట్టలు లేవు కాబట్టి మాంసాహారులు. ఉదా : కుక్కలు, పిల్లులు, చేపలు, పక్షులూ మొదలైనవి.