మహాభారత పద్యాలు (విదుర నీతి)

అరిది విలుకాని యుజ్జ్వల
శర మొక్కని నొంచు దప్పి చనినం జను; నే

ర్పరి యైన వాని నీతి
స్ఫురణము పగరాజు నతని భూమిం జెఱచున్
 

భావం : రాజా! గొప్ప విలుకాడు ప్రయోగించిన కాంతులు చిమ్మే బాణం ఒక్కణ్ణి కొడుతుంది. లేదా తప్పిపోతుంది. ఆరితేరిన నీతివేత్త ప్రయోగించిన నీతి శత్రురాజునూ అతని భూమిని కూడా నాశనం చేసివేస్తుంది.