మహాభారత పద్యాలు (విదుర నీతి)

పురుషుండు రెండు తెఱగుల
ధర నుత్తముడనగ బరగు దానెయ్యెడలం

బరుసములు పలుక కునికిం
దురితంబులు వొరయు పనులు దొఱంగుట కతనన్


భావం : రాజా! ఎన్నటికి సూటిపోటు మాటలు పలుకరాదు. పాపపు పనులు వదలివేయాలి. ఈ రెండు మార్గాల ద్వారా మానవుడు భూమి మీద ఉత్తముడనే ప్రసిద్ధి పొందుతాడు.