మహాభారత పద్యాలు (విదుర నీతి)

చెలిమియు, సంభాషణమును
బలిమి వివాదంబు ద్రోపున్ బాడియున్, దమయం

తలవారితోన తగు; నధి
కుల హీనులతోడనైనన్ గొఱగావధిపా
 

భావం : రాజా! స్నేహం, సంభాషణం, బలమైన వివాదం, కలహం, వ్యవహారం అనే వానిని సాటివారితోనే చేయాలి. ఎక్కువ వారితో గాని, తక్కువ వారితోగానీ చేస్తే ఫలానికి రావు.