ఆయన జీతం 810 కోట్లు మాత్రమేరాజుగారికి దేశంలో మాత్రమే గౌరవం ఉండగా పండితుడికి లోకం అంతటా గౌరవం ఉటుందని ఆర్యోక్తి. భారతీయుడైన నికేశ్ అరోడా (47) వారణాసి ఐఐటీలో ఎక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి అటుపై ఎం.ఎస్, ఎంబీఏ కూడా చదివి ఇప్పుడు జపాన్లోసాఫ్ట్ బ్యాంకు కార్పోరేషన్అధిపతిగా నియామితులయ్యారు. అన్ని రకాల భత్యాలు  కలిపి ఆయన జీతం 16,556 బిలియన్ యెన్్లు అనగా అక్షరాల ఏడాదికి 810 కోట్ల రూపాయలు, ఇంత స్థాయిలో వేతనం లభించటం చాలా అరుదని జపాన్లో పత్రికలు వ్యాఖ్యానించాయి. నికేశ్ అరోడాను సీఈవోగా నియమించటాన్ని బ్యాంకు షేర్ హ్డోర్స్ అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రపంచ వ్యాప్తంగా దేశంలో చూచినా మన హిందువులు ప్రతిభాపాటవాలు ఎన్నదగినవిగా ఉంటున్నాయి. కాని ఇప్పటికి కూడా భారతీయులు మాతృదేశం పట్ల గర్వించకపోవటం శోచనీయం.