లయకారుడు అతి శక్తిమంతుడు
2013లో హిమాలయ పర్వతాలలో సంభవించిన ప్రకృతి విలయతాండవం మనకు గుర్తే. కేదార్ నాథ్ పర్వతం, గౌరీకుండం మొదలుగా గల పర్వతాలపై, చుట్టుప్రక్కల ఉన్న ఎన్నో కట్టడాలు నాశనమయ్యాయి. వందలమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కాని మహాదేవుని ఆవాసమైన కేదారనాథ ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు. ఇది కలియుగంలోనే ఒక వింత. కేదారనాదుడి ఆలయ పునాదులు ఏమాత్రం దెబ్బతినలేదని చెన్నపట్టణంలోని Indian Institute of Technology  (IIT) నిపుణుల బృందం సుదీర్ఘకాలం పరిశోధించి ప్రకటించారు. హిందూ విశ్వాసాలను దెబ్బతీయాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ద్రోహులకు ఇది చెంపపెట్టులాంటిది.