గోవు - భారతీయ ఆర్ధిక వ్యవస్థప్రాచీన భారతదేశంలో ఒక రాజ్యం యొక్క లేదా రాజు యొక్క గొప్పదనాన్ని, లేక ఆర్ధిక సుస్థిరతను అంచనా వేయాలంటే ఆ దేశంలో ఉన్న గో సంపదను ప్రామాణికంగా తీసుకునేవారు. ఆంగ్లేయుల పాలన ముందువరకు అనగా ద్రవ్యచలామణి విరివిగా లభ్యమయ్యేవరకు వివాహ సంబంధాలలో సైతం ఎదుటివారి ఆర్థిక స్థోమతను అంచనా వేయటానికి వారికి గల గడ్డివాములను, పశుసంపదను పరిగణనలోకి తీసుకొనేవారు. కాలక్రమేణా యాంత్రీకరణ, పారిశ్రామికీకరణ కారణంగా సాంప్రదాయ వ్యవసాయ పరిస్థితులలో వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా వ్యవసాయంలో ఎద్దులను ఉపయోగించే స్థానంలో ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు. అలాగే పాడిపరిశ్రమలో కూడా రైతుల దృక్పథం కేవలం వ్యాపారాత్మకంగా తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు ఆర్జించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. నిజానికి శాస్త్ర సాంకేతికత ఆధారంగా సమాజంలో వచ్చే మార్పులను ఆహ్వానించాల్సిందే, వాటిని ఉపయోగించుకొని నిస్సందేహంగా లాభాలు పొందాల్సిందే. గ్రామీణ రైతులు అభివృద్ధి చెందాలి. కాని తాత్కాలిక వ్యాపారాత్మక దృక్పధంతో అతిగా రసాయన ఎరువులను వాడటం వల్ల భూసారానికి తోడ్పడే (భూమిలోని) పంటకు ఉపయోగపడే సూక్ష్మజీవులు చనిపోవటం వల్ల భూసారం క్షీణిస్తుంది. రసాయన ఎరువుల వాడకం వల్ల ఒకటి రెండు సంవత్సరములు పంటలు అధిక ఉత్పత్తిని చేయవచ్చు, కాని భూసారం క్షీణత వల్ల దీర్ఘకాలంలో వ్యవసాయం నష్టదాయకమౌతుంది.
ఈ విపరీత పరిస్థితి గ్రామాలలో ఎంతవరకు చేరిందంటే ఆవులకు కోడెదూడ జన్మించిందంటే దానిని సంవత్సరంలోనే (ఆవు పాలు ఎండిపోతే) కబేళాలకు తరలిస్తున్నారు. అలాగే ఆవుల, ఎద్దుల పోషణను అనుత్పాదక ఖర్చుగా భావిస్తున్నారు. ఆవులు బాగా వయస్సులో ఉన్నప్పుడు దాని నుండి పాలు సేకరించి ఆర్ధిక పరిపుష్టి పొంది, వయసు మళ్ళగానే దానిని కబేళాలకు అమ్ముతున్నారు. ఇది అమానవీయం. ఇది రైతులు కేవలం తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి చేస్తున్న పని. నిజానికి వయస్సు మళ్ళిన ఆవులను, ఎద్దులను ముఖ్యంగా దేశవాళీ ఆవులను పోషించడం వల్ల దీర్ఘకాలంలో రైతులకు దాని పోషణకయ్యే ఖర్చుకంటే ఎన్నోరెట్లు ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా ఆవుపేడ, మూత్రం ఇంకా ఇతర పశుగ్రాసాల నుండి ఎంతో విలువైన సేంద్రీయ ఎరువులు తయారౌతాయి. ఇవి మార్కెట్ లో లభించే రసాయన ఎరువులకంటే ఎన్నోరెట్లు భూసారాన్ని వృద్ధి చేస్తాయి. నేడు విదేశాలలో సేంద్రియ ఎరువులు వాడి పండించిన ఆహార పదార్ధాలకు అధిక ధరలు చెల్లించి కొంటున్నారు. వాటికోసం ప్రత్యేకస్టాళ్ళు కూడా నిర్వహిస్తున్నారు.
మనదేశంలో రసాయన ఎరువులకు బాగా అలవాటు పడిన రైతులు ఆవుపేడను పోగుచేయడం, నిల్వచేయడం, సేంద్రియ ఎరువుగా తయారుచేయడం మొదలైన పనులపట్ల విముఖత పెంచుకున్నారు. దీంతో పంట సాగుకు అవసరమైన ఎరువుల కొరకు సబ్సిడీ ఎరువులపై ఆధారపడాల్సిన దుస్థితి దాపురించింది. దీనికి కారణం ఓట్ల రాజకీయాలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వ సబ్సిడీ విధానాలు. 1960వ దశకంలో కరువు కాటకాలు సంభవించినపుడు రైతులను ఆదుకోవటానికి ఎరువులపై సబ్సిడీని ప్రవేశపెట్టారు. ఐతే ఆ క్లిష్ట పరిస్థితిని అధిగమించిన తరువాత కూడా ఈ సబ్సిడీ పథకం రాజకీయ పక్షాలకు ఓట్లు రాలుస్తూ నేడు కూడా కొనసాగుతున్నది. ఫలితంగా చిన్నరైతులు సైతం సబ్సిడీ ఆశతో రసాయన ఎరువులను అధికంగా వాడుతున్నారు. ఈ కారణంగా దీర్ఘకాలంలో రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం తగ్గుతున్నది.
కనుక ప్రభుత్వాలు కూడా ఈ పరిస్థితులను గమనించి రసాయన ఎరువులపై ఇస్తున్న సబ్సిడీని సాంప్రదాయ పశువుల కొనుగోలుకు, వాటి మేతకు, సేంద్రియ ఎరువుల తయారీకి ఇస్తే పరిస్థితులలో తిరిగి మార్పు రావచ్చు.
నీ ఇంటి ముందు ఒక్క ఆవు ఉంటే, నీ ఒంట్లో ఒక్క రోగం కూడా ఉండదు. వైద్యశాస్త్రానికి అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగలదు గోమాత. ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి, దైవస్వరూపం గోమాత. అమెరికా వేలకోట్లతో మన ఆవుమీద పేటెంట్స్ తీసుకొని మనకే మందులమ్మబోతున్నది. ఇది భారతీయులమైన మనకు సిగ్గుచేటు.
- పతికి