పథకం ప్రకారం హిందుత్వంపై మీడియా మాఫియా దుష్ప్రచారం
సంచనాల కోసం స్థాయికైనా దిగజారుతామని తమ చేతల ద్వారా ప్రకటించుకుంటున్నాయి మన మీడియా సంస్థలు. హిందూ పండుగ వచ్చినా పనిగట్టుకుని కొన్ని ఛానెళ్లు, పత్రికలు మూకుమ్మడిగా ధర్మంపై దుష్ప్రచారం సాగిస్తున్నా యి. హిందూ సంస్కృతిని ద్వేషించడమే పనిగా పెట్టుకున్న పనిలేని ఎల్లయ్యను మేథావులుగా పరిచయం చేస్తూ, హిందూ సాంప్రదాయాలపై విషం చిమ్మే బాధ్యతను వారికి అప్పగిస్తున్నాయి. తద్వారా సంచనాలు రేకెత్తించడం వల్ల సదరు మేధావులను తిట్టుకుంటూ అయినా జనాలు విరగబడి ఛానెళ్లు చూస్తారు. దీంతో వారి టి.ఆర్.పి. రేటింగ్లు పెరిగి అధిక ఆదాయం సంపాదించవచ్చు. అంతే కాకుండా హిందూమతాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శించేవారికి తగు వేదిక ఏర్పాటు చేయడం ద్వారా హిందూ వ్యతిరేక శక్తుల నుంచి, విదేశీ మిషనరీ నుంచి కూడా భారీఎత్తున సంపాదించవచ్చు. ఇదీ వారి కుట్ర.
హోలీ, దసరా, దీపావళి, శ్రీరామనవమి.. ఇలా పండుగలన్నీ కూడా కల, వర్గాలకు అతీతంగా, కలసికట్టుగా జరుపుకోవడం అనేది అనాదిగా వస్తున్న హిందూ సాంప్రదాయం.   అంతేకాదు, పండుగ పరమార్ధం కూడా సామాజిక ఐక్యతే. కానీ మధ్య ఒక కుట్రపూరిత ప్రచారం ఊపందుకుంటోంది. హిందూ పండుగలన్నీ కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితమట! క్రైస్తవ మిషనరీలు దళితులను మతం మార్చడానికి తరచూ ఉపయోగించే పదజాలం ఇది. ఇదే వాదాన్ని సమర్ధిస్తూ ఇటీవల ముగిసిన గోదావరి పుష్కరాల సందర్భంగా ఆంధ్రజ్యోతి అనే పత్రికలో ఒక వ్యాసం ప్రచురితమైంది. పుష్కరాల్లో దళితులు ఎవరైనా స్నానం చేశారా అంటూ అందులో మతిభ్రమించిన ప్రశ్న. మరికొందరైతే రాజమండ్రి పుష్కర ప్రమాదంలో చనిపోయినవారంతా దళితులే అంటూ  అర్ధంలేని వాదన. పోనీ సదరు మేధావికి విపులంగా వివరించడానికి ప్రయత్నించినా అవకాశం ఉండదు. కేవలం ఆచారాలను ప్రశ్నించడమే తప్ప నిజాలు తెలుసుకుంటే వీరి మేధావితనం చిన్నబోతుంది. పుష్కరస్నానాలు చేసిన భక్తులను కులపరంగా ఎవరైనా లెక్కిస్తారా? ఇటువంటి చర్య ద్వారా కొన్ని కుట్రపూరిత మీడియా సంస్థలు ఐక్య హిందూ సమాజంలో లేనిపోని అసమానతలు సృష్టించాలని చూస్తున్నాయి. ఇకపోతే ప్రతి హిందూ పండుగను పనిగట్టుకుని విమర్శిస్తూ, తామేదో దళిత, అణగారిన వర్గాలకు మేలు చేసేస్తున్నామని భ్రమింపజేసే మేధావులు, సెక్యులర్్ మీడియా సంస్థలు.. స్వస్థత సభ పేరిట క్రైస్తవ సంస్థ ఏర్పాటు చేస్తున్న మోసపూరిత కార్యక్రమాల గురించి ఎందుకు మాట్లాడవు? విదేశీ నిధులతో, విదేశీ మిషనరీ సాయంతో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ కార్యక్రమాల్లో క్యాన్సర్, ఎయిడ్స్ వంటిరోగాలను కేవలం చేతి స్పర్శతో నయం చేస్తామంటూ వారు చేస్తున్న ప్రచారం నిజంగా మన మీడియాకు కనిపించట్లేదంటే ఎలా నమ్మాలి? అటువంటి ప్రచారం ద్వారా మోసపోయి సంస్కృతిని వీడుతున్నది దళితులు కాదా? ఇటువంటి వాటిని ప్రశ్నించే సామాజిక బాధ్యత మీడియాకు లేదా? పుష్కరాల్లోని, పండుగల్లోని శాస్త్రీయత ఉందా అని గొంతు చించుకునే వారికి వంత పాడే పత్రికలకు మొహర్రం సందర్భంగా శరీరమంతా గాయాలు చేసుకుంటూ నృత్యాలు చేయడం వంటివి కనిపించవా? మరి అలాంటి సందర్భాల్లో ఎందుకు నిర్వహించవు చర్చలు?
సమాజహితం కన్నా సంచలనాలే ప్రధానమనుకునే టీవీ ఛానెళ్లు, పత్రిక నిజస్వరూపం ప్రజలు గమనిస్తున్నారు. వీటి పట్ల సామాజిక మాధ్యమాల్లో తీవ్ర నిరసన, వ్యతిరేకత పెలుబికుతోంది. ఇటువంటి వాటిని స్వచ్ఛందంగా బహిష్కరించడం ద్వారా ఇటువంటి ఛానెళ్ల టీఆర్పీ రేటింగ్లు, పత్రిక సర్క్యులేషన్ను తగ్గించడమే మనం నేర్పగలిగే గుణపాఠం అని అందరూ భావిస్తున్నారు. మరి మీరు?