పరాభవం ఓడింది పరాక్రమం జయించింది

  జ్యేష్ఠశుద్ధ త్రయోదశి, 1674 సంవత్సరం. భారత పౌరుషం ప్రకటితమైన రోజు. పరాభవం మరచి పండుగ చేసుకొన్నరోజు. 35 సంవత్స రాలపాటు నిద్దురలేకుండా దేశం కోసం యుద్ధం చేసినవీరుడ్ని జాతి స్మరించుకునే రోజు. హిందూ పదపాదుషాహిగా శివాజీ పట్టాభిషిక్తుడైన రోజు. వరుస విదేశీ దండయాత్రతో కునారిల్లిన జాతిలో ఆత్మవిశ్వాసం నింపాడు శివాజీ. చైతన్యం రగిలిం చాడు. హిందువులు శాసించగలరా? శస్త్రాు ధరించగలరా? సంధించగలరా? అన్నవాదనను రోదనను పటాపంచలు