అరుదైన చిరస్మరణీయ దార్శనికుడు అబ్దుల్‌ కలాం..దేశ పరంపరాగత శాస్త్రజ్ఞానంను, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని కలగలిపి దేశం భవిష్యత్తు గురించి ఆలోచించిన వారు అబ్దుల్ కలాం. భారత శాస్త్రసాంకేతిక రంగాలో దూసుకోని పోయేందుకు కృషి చేసినవారిలో అగ్రగణ్యు డు అబ్దుల్ కలాం. శాస్త్రజ్ఞానం, సాంకే తిక జ్ఞానం సామాన్య వ్యక్తుల జీవితాలలో వెలుగు నింపాలని వారి ప్రగాఢమైన ఆకాంక్ష. పల్లెకు పట్టణ సదుపాయా కల్పనకోసం (పురా)  ఒక ప్రథకం ప్రారంభించారు. దానికోసం వారు దాచుకొన్న డబ్బు, వారిజీతం కేటాయించారు. ఒక రాష్ట్రపతిగానా అవసరాలు ప్రభుత్వం చూసు కొంటుంది కాబట్టి నాకు జీతంతో పని ఏమి ఉంటుందని వర్గీస్కురియన్తో పు.రా. పథకం గురించి చెబుతూ చెప్పారు.
దేశంలో అభం, శుభం తెలియని చిన్నారులు, యువకుల మనసులో దేశం గురించి కలలుగనండి , దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించటానికి బాగా చదువుకోండి, మీ శక్తిని, నైపుణ్యా న్ని దేశం కోసం వినియోగించడని సకారాత్మక భావనను కలిగించటానికి దేశమంతా తిరిగేవారు. వారి జీవితం చివరిక్షణం కార్యక్రమంలోనే ముగిసింది. షిల్లాంగ్లో ఐఐమ్ విద్యార్థు నుద్దేశించి ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలి లోకాన్ని వదిలిపెట్టారు. వారిలో యువకులకు ప్రేరణ ఇచ్చే స్వభావాన్ని గుర్తించి అబ్దుల్ కలాం పుట్టిన రోజు అక్టోబర్ 15ను ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా యుఎన్ (యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్) అప్పటికే ప్రకటించినది. తరువాత కొద్ది రోజులకే వారు లోకాన్ని విడిచిపెట్టారు.
ప్రపంచ పోలీస్ పాత్రపోషించే అమెరికా ఉప గ్రహాలకు చిక్కకుండా భారత్ అణ్వాస్త్రా తయారికి అణు విస్ఫోటం నిర్వహించడంలో ఒక కీలక పాత్ర పోషించినవారు అబ్దుల్ కలాం. అమెరికా కళ్ళుగప్పి ఆపైన తగుజవాబు చెప్పి మరీ అణు పరీక్షు భారత్ విజయవంతంగా నిర్వహించింది. ప్రపంచంలో సగర్వంగా తలెత్తుకుని నిలబడిరది.
స్వతంత్ర భారత చరిత్రలో రాజకీయాలతో సంబంధంలేని అబ్దుల్కలాం దేశ రాష్ట్రపతి కావ టం ఒక అరుదైన విషయం. నిలువెత్తు భారతీయతను పుణికిపుచ్చుకొని ప్రజలతో కలిసిపోయి ప్రజ రాష్ట్రప తిగా మన్ననలు పొందారు. జీవితం చివరరోజు కూడా దేశం గురించి వ్యథచెందారు. పంజాబ్లో ఉగ్రవాదుల దాడి, ఇంకొక ప్రక్క పార్లమెంటులో సంకుచిత రాజకీయ గందరగోళం చూసి ఎంతో కలతచెందారు. పార్లమెంటును మరింత నిర్మాణాత్మకంగా నడపటానికి ఏమి చేయాలో సూచించండనే ప్రశ్న ఐఐఎమ్ విద్యార్థులను అడగాలని అనుకున్నారు ప్రశ్న అడగకుండానే వారి జీవితం ముగిసిపోయింది.  
దేశం గురించి నిరంతరం తపించిన అబ్దుల్ కలాం  లోకహితం పత్రిక వినమ్ర శ్రద్ధాంజలి ఘటిస్తోంది.