గోదావరి పుష్కరములుమన హిందూదేశం పరమ పవిత్రం, మనది పుణ్యభూమి, ధర్మభూమి దేవభూమి కూడా, ఆధ్యాత్మిక  చింతన గల ఏకైక దేశం భారతదేశం, మిగిలిన ప్రపంచ దేశాలకు ‘‘మతంఉన్నప్పటికీ ఆధ్యాత్మికత లేదు. ప్రస్తుతం మనం శ్రీమన్మథనామ సంవత్సరంలో ఉన్నాము. సంవత్సరము గోదావరి నదీ పుష్కరాలు జరగబోతున్నాయి.  పుష్కరం అనగా పన్నెండు సంవత్సరము కాలం. ఒక్కొక్క నదికి పన్నెండు సంవత్సరములకు ఒకసారి పుష్కరం సంభవిస్తుంది. విధముగా పుష్కరాలు జరిగే నదులు మన దేశంలో పన్నెండు ఉన్నాయి. పుష్కరాలనే ఉత్తరప్రదేశంలో కుంభమేళా అంటారు. సంవత్సరం జూలై 14 తేదీన గురువు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేక్షణంలో గోదావరినది పుష్కరాలు ఆరంభం అవుతాయి. ఇదే విధంగా గురువు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఆయా నదులకు  పుష్కరాలు వస్తాయి. ఏదైనా ఒక రాశిలో ప్రవేశించిన గురువు రాశిలో ఒక ఏడాది పాటు ఉంటాడు. కాబట్టి ఏడాది మొత్తం పుష్కర కాలంగానే పరిగణించబడుతుంది. కాని పుష్కర సంవత్సరంలోని మొదటి 12 దినాలు చివరి 12 దినాలు పవిత్ర స్నానాలు ఆచరించే కాలం. అందునా మొదటి 12 దినాలు ఇంకా ఘనంగా భావిస్తున్నాం. మొదటి 12 దినాలనుఆది పుష్కరముఅని అంటారు.
పుష్కర కాలంలో సమస్త నదీనదా దివ్యశక్తులు అన్నీ కూడా నదిలోకి ప్రవేశిస్తాయి. సమస్త దేవీదేవత సాన్నిధ్యం కూడా ఏర్పడుతుంది. కాబట్టి సమయంలో ప్రజలందరూ కూడా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దానం, ధ్యానం, పూజ, హోమం, తర్పణము, పిండ ప్రదానం, శ్రాద్ధకర్ము మొదలైన పుణ్యకార్యాలు వీలును బట్టి తప్పకుండా చేయాలి. గోదావరినది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలో వివిధ పట్టణాలు నగరాల గుండా ప్రవహిస్తున్నది. కాళేశ్వరం, ధర్మపురి, బాసర, భద్రాచలం, కొవ్వూరు, రాజమండ్రిలో విస్తృతంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాబట్టి మనమందరం కూడా సదవకాశాన్ని ఉపయోగించుకుని పుష్కర స్నానాలు చేసి ధార్మిక కార్యాలు ఆచరించి ధన్యువుదాం.
-ధర్మపాలుడు