అమరవాణిచాణక్యుడు ఇలా అన్నాడు..
దుర్జనస్య సర్పస్య ` వరం సర్పో దుర్జనః
సర్పోదంశతి కాలేన ` దుర్జనస్తు పదే పదే
అనగా ` ఒక పామునో లేక దుష్టుడినో ఎంచుకోవలసివచ్చినప్పుడు, పామునే ఎంచు కొనవలెను. ఎందులకనగా ! పాము ఆత్మరక్షణ కోసమే కాటు వేస్తుంది, కాని దుర్జనుడు నిష్కారణంగా అడుగడుగునా కాటు వేస్తూనే ఉంటాడు. తస్మాత్ జాగ్రత్త !
(చాణక్య నీతి 3`4)