సంపాదకుని మాట; ఆధిపత్య ధోరణి గలవారు అసత్యానే ప్రచారం చేస్తారు

అమెరికా దేశానికి చెందిన యునైటెడ్ స్టేట్ కమిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (USCIRF) కమిటి ప్రతి సంవత్సరం ప్రపం చంలో ఆయా దేశాలలో మతపరమైన విషయాలపై నివేదిక తయారుచేస్తూ ఉంటుంది. అమెరికా ప్రపంచపోలీసుగా వ్యవహరించే వైనం మనంద రికి తెలుసు. అటువంటి పోకడే కమిటీ, కమిటీ తయారుచేసే నివేదిక. సంవత్సరం (2014`15) నివేదికలో భారతదేశంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత మతపరంగా మైనా ర్టీలుగా ఉన్న ముస్లిం, క్రైస్తవులపై దాడు పెరిగాయని వ్రాసింది. ‘‘భారత్లో మతపరమైన అసహనం పెరుగుతున్నదని, మైనార్టీలపై దాడులు కూడా పెరుగుతున్నాయని అందులో వివరించబడింది. అంతేకాకుండా ముస్లిం, క్రైస్తవులను ఘర్వాపసీ పేరుతో హిందూమతంలోకి బలవంతంగా మారుస్తున్నారు. మారుతున్న వాళ్ళకు డబ్బుకూడా ఇస్తున్నారుఅని వ్రాసింది.
భారత్లోని కొన్ని ఎన్.జి..లు భారత్ను క్రైస్తవీకరణ చేసేందుకు దశాబ్దా నుంచి ప్రయత్నం చేస్తున్నారు. కాల క్రమంలో ఎన్జివోల బండారం బయటపడుతున్నది. వాళ్ళ కుట్రలు ప్రజలకు, ప్రభుత్వాలకు అర్థమవుతున్నాయి. వాళ్ళ కార్యకలాపాలపై ప్రజలలో కూడా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. విషయాలను కప్పిపుచ్చుకొనేందుకు చేసేకుట్రలో భాగంగా అమెరికా అధ్యక్షుడికి ఇక్కడి క్రైస్తవ మిషనరీ ఒక మెమోరాండం ఇచ్చిన విషయం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దీని సారాంశమే రిపోర్టులో కనబడుతున్నది. అసలు అమెరికా దేశం నుండి ప్రపంచంలో అనేక దేశాలనుండి టూరిస్టు వీసాతో భారత్కు వచ్చి మతప్రచారం చేస్తున్న వాళ్ళ విషయం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి.
అమెరికా దేశం నుండి, ప్రపంచంలో అనేక దేశాలనుండి టూరిస్టు వీసాతో భారత్కు వచ్చి మతప్రచారం చేస్తున్న వాళ్ళ విషయం రిపోర్టులో ఎక్కడా ప్రస్తావన లేదు. అమెరికా ప్రభుత్వం మొట్టమొదట ఇటువంటి మతప్రచార టూరిస్టులను భారత్కు రాకుండా నిరోధించ గలిగితే బాగుంటుంది. దేశంలో మతంమార్పి డు కోసం అమెరికా నుండి, ఇంకా ఇతర దేశాల నుండి వస్తున్న నిధులప్రవాహాన్ని ఆపటంలో అమెరికా విఫమవుతోంది. దేశంలో మతఘర్షణలు, మతమార్పి డులు శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి. అవి ఎవరి కారణంగా జరుగుతున్నాయో అందరికి తెలుసు. ఇటు వంటి కార్యకలాపాత గురించి రిపోర్టులో ఎక్కడా ప్రస్తావించలేదు. ఎక్కడో చెదురు మదురు గా జరిగిన కొన్ని సంఘటనలను, అవికూడా యాదృచ్ఛిక సంఘటన ఆధారంగా భారత్లో మత అసహనం పెరుగుతున్నది అని చెప్పటం నిజం గానే ప్రపంచ పోలీసు పాత్ర. ప్రపంచంలో అన్ని మతాలను గౌరవించేది కేవలం హిందువులు మాత్రమే. అన్ని మతాలోను, అన్ని మతాల మధ్య సామరస్యం ఉండాని కోరుకొనేది కూడా హిందువులు మాత్రమే. ప్రపంచం లో మతఘర్షణలు నిర్మాణం చేస్తున్నవి ఇస్లాం, క్రైస్తవులు మాత్రమే. కమిటీ సత్యాన్ని కూడా వెల్లడించి ఉంటే బాగుండేది.  ఆధిపత్య ధోరణి కలిగినవారు సత్యమును వ్లెడిరచేందుకు ఇష్టపడరు. అసత్యాలను అర్థ సత్యాలను ప్రచారం చేస్తూ ఉంటారు.