గురుపూర్ణిమ `వైభవముభారతదేశం కర్మభూమి. పుణ్యభూమిలో దేవతలు సైతం తలవంచి నమస్కరించే  వశిష్టుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, కశ్యపుడు వంటి సప్తఋషు గురుస్థానం వహించి ఎందరో దేవతలకు, చక్రవర్తులకు ధర్మమార్గం నిర్దేశనం చేశారు.  పథంలోనే వేదవ్యాసుల వారు, సనక, సనందనాదు, ఆదిశంకరు వంటి ఎందరో గురువు జాతికి అనంతమైన వైదిక సాహిత్య సంపదనూ అందజేశారు.  కనుకనే పుణ్య భూమిలో గురువుకు తల్లి, తండ్రి తరువాత గౌరవనీయస్థానం గురువుకీ ఆపాదింపబడిరది. అందుకే మన ఉపనిషత్తులో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని చెప్పబడినది.
గురువు అనే పదములోగుఅనే అక్షరము చీకటి అనే అర్థాన్ని సూచిస్తుంది. అలాగేఅనే అక్షరము వెలుతురు లేదా కాంతి అనే అర్థాన్ని సూచిస్తుంది. గురువు అనగా అజ్ఞానాంధ కారమునుండి విజ్ఞానము అనే కాంతి లోకానికి మార్గదర్శనం చేయిస్తూ నడిపించేవాడే. విశాల ధృక్పదంలోగురువు అని పిలుస్తున్నాము. అలాంటి గురువును గౌరవించే సాంప్రదాయంలో భాగంగానే, అనాదిగాగురు పౌర్ణమఉత్సవాన్ని సనాతనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. స్వాతంత్య్రానంతరము డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినప్పటికీ, అనాదిగా దేశంలో వేదవ్యాసుని జన్మదినమైన ఆషాడ శుద్ధ పౌర్ణమనేగురుపూర్ణిమదినోత్సవంగా జరుపుతూ ఆయా గురువులను గౌరవించడం, సన్మానించడం సాంప్రదాయంగా వస్తున్నది.
వేదాలు అపౌరుషేయాలు. అవి బ్రహ్మ వాచస్సు నుండి నేరుగా ఉద్భవించినాయి. వేదవ్యాసుల వారికి పూర్వం వేదవాజ్ఞ్మయమంతా స్థూలంగా వుండినది.దానిని వేదవ్యాసులవారు ఋక్, యజుర్, సామ, ఆధర్వణ వేదాలు (చతుర్వేదాలు)గా వర్గీకరించారు.
అంతేకాదు వేదమూలాన్నిసంహిత గాను వేదము యొక్క అంత్యభాగాను బ్రాహ్మణాలు, అరణ్యకాలుగా వర్గీకరించారు.  ఇవే భారతీయవైదిక వాజ్మయంలో వేదాంతాలుగా పిలవబడుతున్నాయి. అలాగే   ప్రధానంగా   దశోపనిషత్తును   వర్గీకరించారు.   ఇంతటి  విలువైన  వైదిక వాజ్మయాన్ని ఒక క్రమమైన పద్ధతిలో వర్గీకరించి సంస్కరించి అధ్యయనానికి వీలుగా సరళ పరచినందుకు వారికి కృతజ్ఞతా పూర్వకంగా వారి జన్మదినమైన ఆషాడ శుద్ధ పౌర్ణిమనే గురుపౌర్ణిమగా తదుపరి తరాలవారు పాటిస్తున్నారు.
సంఘము ` గురుపౌర్ణిమ ఉత్సవము: సంఘము అధికారికంగా నిర్వహించే పండుగలో ఉగాది, విజయదశమి,  సంక్రాంతి,  రక్షాబంధన్ పండుగుతో బాటుగా గురుపౌర్ణమ ఉత్సవం ఘనంగా నిర్వహింపబడుతుంది. కానీ పరమ పూజ్య డాక్టర్జీ దూరదృష్టితో అనేక కోణాలో ఆలోచించి సంఘములో గురుపూర్ణిమకార్యక్రమాన్ని ఒక విలక్షణమైన సాంప్రదాయంగా తీర్చి దిద్దారు. కేవలం ఒక వ్యక్తిని గురువుగా భావించి గురుపూజ మహోత్సవం నిర్వహించి నట్లయితే అది వ్యక్తి పూజకు దారి తీసే అవకాశం వుంటుంది. అలాగే గురువుగా భావించిన వ్యక్తి యొక్క బోధను, ఆశయాలు, సూక్తులు కాల క్రమంలో కొంతకాలం తరువాత ఆవి ప్రభావాన్ని కోల్పోవచ్చు.  కనుక ప్రథమ సంఘచాకులైన డాక్టర్జీ జాగ్రత్తగా ఆలోచించి ఒక వ్యక్తిని గురువుగా కాక సనాతన భారతీయ సాంప్రదాయంలో కాషాయ ధ్వజానికి వున్న ప్రాధాన్యాన్ని, పవిత్రతను దృష్టిలో వుంచుకొనికాషాయ ధ్వజాన్ని హిందూ సమాజానికి శాశ్వతమైన గురువుగా దిశా నిర్దేశం చేశారు. కాషాయ ధ్వజము సూర్యోదయంలో అరుణోదయ కాంతితో సమానంగా వెలుగొందుతూ వుంటుంది. అలాగే యజ్ఞయాగాదులో వచ్చే అగ్ని కీలాలు ముదురు కాషాయ వర్ణముతో వుంటాయి. అంతటి ప్రాముఖ్యత వున్నందుననే కాషాయ ధ్వజము సనాతనంగా అనేక వేల సంవత్సరాలుగా హిందూ దేవాలయాలపై శుభ సూచకంగా ఆవిష్కరింపబడుతున్నాయి. అంతటి ప్రాముఖ్యత వున్నందున డాక్టర్జీ కాషాయ ధ్వజాన్ని సమాజానికి శాశ్వత గురువుగా స్వీకరించాలని సూచించారు.
గురుపూర్ణిమ`గురుదక్షిణ సమర్పణ: దేశం ` సమాజం నాకేమిచ్చింది? అని ప్రశ్నించుకునే ముందు, దేశానికి `సమాజానికి నేను ఏమి ఇవ్వగలను అని ప్రతి ఆదర్శపౌరుడు తనకు తానుగా ప్రశ్నించుకోవాలి. అదే గురుదక్షిణ సమర్పణలోని అంతరార్థము. తాత్వికంగా ఆలోచిస్తే రోజున మనిషి సంపాదిస్తున్న ప్రతి రూపాయ కూడా ప్రకృతి నుండి సృష్టింపబడినదే. పంచ భూతాత్మకమైన ప్రకృతి నుండి, నీరు, అగ్ని, వాయువు, భూమి, ఆకాశ రూపంలో వున్న ధాతువును వినమయ వస్తురూపంలోకి మార్చి ధనాన్ని సంపాదిస్తున్నారు.  దేశం ` సమాజంలోని ప్రకృతిద్వారా ఒక వ్యక్తి సంపాదిస్తున్న ధర్మమైన సంపాదనలో కొంత భాగాన్ని తిరిగి సమాజ శ్రేయస్సుకు, అభ్యున్నతికి సంపూర్ణ త్యాగ భావంతో పవిత్ర భగవద్వజాన్ని గురువుగా భావిస్తూ సమర్పించడమే సంఘములోని గురుదక్షిణ సమర్పణ కార్యక్రమంలోని అంతరార్దం. కనుక, సంఘ కార్యకర్తలు, సంఘేతయి కూడా పవిత్రమైనగురుపూజ మహోత్సవంలో పాల్గొని వారి వారి ధర్మమైన సంపాదనలో కొంత భాగాన్ని సమర్పణ చేసి గురుపూర్ణిమ కార్యక్రమాన్ని విజయవంతం చేయగరని ఆశిద్దాం.
-పతికి