దేశ రక్షణకు కీలకమైనది కాశ్మీర్‌భారతదేశానికి స్వతంత్య్రం వచ్చి రేపు వచ్చే ఆగష్టు 15కి 68 సంలు పూర్తి అయి 69 సంలోకి అడుగుపెట్టబోతున్నది. ఒక ప్రక్క రాజకీయ అస్థిరత, మరో ప్రక్క అనేక సామాజిక సమస్యలు, ఇంకో ప్రక్క సరిహద్దు ఆవలి నుండి వచ్చే సమస్యలు, వీటన్నింటి మధ్య భారతదేశం ప్రయాణం చేస్తున్నది. ప్రపచంతో పోటీ పడుతూ శాస్త్రసాంకేతిక రంగాలో దూసుకొని పోతున్నది. ఆర్థిక రంగంలో నిద్రొక్కుకొనేందుకు కృషి చేస్తున్నది. దేశంలో అభివృద్ధి, బీదరికం పరస్పరం పోటిపడుతున్నాయి. సామ్యాన్య వ్యక్తుల జీవనంలో వెలుగులు నింపటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
యువశక్తి ప్రధానంగా కలిగిన దేశంలో యువకులను దేశాభివృద్ధి సాధించేదిశవైపు నడిపించటానికి దేశంలో విశేష కృషి జరుగుతున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో ప్రభుత్వాలు స్థిరంగా పనిచేసాయి. క్రమంగా సంకీర్ణ రాజకీయాల వైపు దేశం పాలనా వ్యవస్థ నెట్టబడింది. మొన్నటి ఎన్నికలతో కొంతమేరకు సంకీర్ణ రాజకీయాల  బెడద తప్పినట్లుగా కనబుడుతున్నా సమస్యను ఎదుర్కొంటున్నది. రాజీకయ సుస్థిరత రానంతవరకు దేశం విజయవంతంకాలేదు. భారతదేశంలో రాజకీయ స్థిరత్వం రాకపోవటానికి స్వాతంత్య్రం పోరాటకాలం నుండి దేశంలో జరుగుతున్న సైద్ధాంతిక సంఘర్షణలు మూలకారణము. దేశంలో  అనాది కాలం నుండి వైవిధ్యం ఉన్నది. వైవిధ్యంలోనే దేశహితం అనే లక్ష్యం ఉండేది. ఏదైనా  గీటురాయి దేశహితమే. కాని ఇప్పుడు కొనసాగుతున్న సైద్ధాంతిక సంఘర్షణలో ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. పరిస్థితులో మార్పురావాలి. ఒక జాతిగా సగర్వంగా తలెత్తుకొని ప్రపంచంలో నిబడేటట్లుగా దేశాన్ని తిర్చిదిద్దా లి. అటువంటి సకారాత్మక పోరాటం జరగాలి.
దేశం ఎదుర్కొంటున్న సమస్యలో ఒక ప్రక్క నక్సలిజం మరో ప్రక్క ఇస్లామిక్ తీవ్రవాదం, ఇంకొక ప్రక్క ఈదేశాన్ని క్రైస్తవీకరణ చేయాలనే అంతర్జాతీయ కుట్రలు జరుగుతున్నాయి. వీటి నుండి దేశాన్ని సరైన దిశవైపు నడిపించే ఒక శక్తివంతమైన నాయకత్వం కోసం దేశం ఎదురుచూస్తున్నది.
శతాబ్దాల ఇస్లాం దురాక్రమణ 1947 ఆగస్టు 14 దేశాన్ని ముక్కలు చేసింది. 1200సం సుదీర్ఘ పోరాటాన్ని దేశంలో ఇస్లాం దురాక్రమణ చేసుకొంటూ వస్తున్నది. ఇంకా చేస్తూనే ఉన్నది. ముస్లింకు ప్రత్యేకదేశం ఇచ్చి వేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని కొందరు కలలుగన్నారు. స్వతంత్ర భారతం శాంతియుతంగా ఉంటుందని ఇంకా కొందరు పగటికలుగన్నారు. స్వతంత్ర ముస్లిం దేశంగా ఏర్పడిన పాకిస్థాన్ తొలిరోజుల్లోనే ఈదేశం నుండి కాశ్మీర్ను వేరుగాచేయాలని దాడి ప్రారంభించింది, భారతసైన్యం దానిని తిప్పికొట్టింది. రోజుల్లోని మన దేశ నాయకత్వం వ్యక్తిగత ప్రతిష్టకు పోయి కాశ్మీరును రావణకాష్టంగా మార్చారు. కాశ్మీర్లోని కొంత భూభాగం పాకిస్థాన్ ఆక్రమణలో ఉండిపోయింది. రోజు నుండి రోజువరకు కాశ్మీర్ సమస్యను భారతదేశం పరిష్క రించుకొని పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీరును తిరిగి స్వాధీనం చేసుకోలేకపోయింది. పి.వి. నర్సిం హారావు ప్రధానిగా ఉన్న సమయంలో పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ను స్వాధీనం చేసుకోనటమే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం అని పార్లమెంట్లో ఉభయసభలు తీర్మానం చేశాయి. కాని దానిని ఇంతవరకు ఆచరణాత్మకం చేయలేదు.
దేశ రక్షణకు అత్యంత కీలకమైన కాశ్మీరు విషయంలో స్వాతంత్య్రం వచ్చిననాటి నుండి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సమస్యను ఇంకా జటిలం చేస్తూ వచ్చింది. ఒక ప్రక్క పాకిస్థాన్ నుండి ఎదురవుతున్న సమస్యలు, కాశ్మీర్ లోయ ప్రాంతంలో వేర్పాటువాద సంస్థలు, ఇంకొక ప్రక్క 370 ఆర్టికల్ పేరుతో జరుగుతున్న సమస్యను మొత్తం కగలిసి కాశ్మీర్ను రావణకాష్టంగా చేశాయి.
1948 నుండి నేటివరకు జరిగిన పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. కాశ్మీర్ పై జరిగిన దాడులో సైన్యం కాని, సామాన్య ప్రజలుకాని ఇప్పటి వరకు 30,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్ను పాకిస్థాన్ ఆక్రమించుకోవాలని 1948 నుండి ప్రయత్నిస్తుంటే, కాశ్మీర్లో ఇస్లాం ఆధిపత్యం కోల్పోకుండా ఉండాలని కాశ్మీర్ లోయలోని సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కాశ్మీర్ ఇంకొక ఇస్లాం దేశం కావాలని కొందరు కలుగంటున్నారు. ఇస్లాం యొక్క ఆక్రమణ ధోరణికి ప్రత్యక్ష ఉదాహరణ కాశ్మీర్ సమస్య ఒకవేళ కాశ్మీర్ను పూర్తిగా తమ ఆధిపత్యంలోకి తీసుకొన్న తరువాత అంతటితో ఆగుతారా అంటే ఇంకొ దగ్గర ఇస్లామీకరణకు ప్రయత్నాలు ప్రారంభం చేస్తారు. అస్సాం పరిస్థితులు, బెంగాల్ పరిస్థితులు ఏమిపాఠం చెబుతున్నాయో దేశం గమనించే స్థితిలో ఉన్నదో లేదో?
1200 సం ఇస్లాం దురాక్రమణ చరిత్రనుండి భారత్ ఇంకా పూర్తిగా పాఠాలు నేర్చుకోలేదు అని చరిత్ర చెబుతున్నది. పరిస్థితును చక్కదిద్దుకోవాలి. కాశ్మీర్ సమస్యను మార్గంలోనైన పరిష్కరించుకోవటానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. పాకిస్థాన్ మనపైన మళ్ళీ`మళ్ళీదాడి చేసే సాహసం చేయలేని విధంగా పాకిస్థాన్కు పాఠాలు చెప్పవలసి ఉంది. పాకిస్థాన్ కారణంగా ఇప్పటికే ఎంతో మ్యూలం చెల్లించాము. పాకిస్థాన్ ప్రేరేపిత ఇస్లామిక్ తీవ్రవాదం, ఉగ్రవాదం, ప్రపచంలో ముఖ్యంగా ఆసియాలో పెరుగుతున్న ఇస్లామిక్ ఉగ్రవాదుల లక్ష్యాలు ఎట్లా ఉంటాయనే విషయంపై గత కొద్ది సంలు అనేక చర్చలు జరుగుతున్నాయి.  ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలు బలపడుతూ మధ్య ఆసియాకే పెద్ద సవాలుగా మారుతున్నది. ఇస్లామిక్ సామ్రాజ్యమే లక్ష్యంగా జరుగుతున్న ఉగ్రవాదక్రీడలో పూర్తి ఇస్లామీకరణ చేయటానికి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్ను గుర్తించి పావు కదుపుతున్నట్లుగా మధ్య రెండు రోజుల క్రితం (జూలై చివరి వారంలో) అమెరికా పత్రికలో ఒక విశ్లేషణ వచ్చింది. దానిని కేంద్ర ప్రభుత్వం కొట్టివేసింది కాని సుదీర్ఘ లక్ష్యా సాధనకోసం  ప్రయత్నిస్తు ఇస్లామిక్ సామ్రాజ్యం కలసాకారము కావాలంటే వాటి లక్ష్యాం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, భారత్ ఉంటాయని అనటం కొట్టివేయలేము. మనం ఇప్పటికే ఎంతో మ్యూం చెల్లించాము పాకిస్థాన్తో ఎంతో నష్టపోయాము. ఎన్నో చికాకులు అనుభవించాము. ఎంతో రక్తం చిందించాము. స్వామి వివేకానంద ‘‘ఇప్పటి వరకు ఎంతో ఎడ్చాము, ఇంకా ఏడ్చినా కళ్ళవెంబడి నీళ్ళు రానంత ఏడ్చాము ఇక ఏడ్చి లాభం లేదు లేచినిబడదాముఅని చెప్పారు.  దేశాన్ని కాపాడు కోవటానికి సమర్థులు అవసరం. పరిస్థితులు ఇకముందు ఇట్లా జరిగేందుకు వీలులేదు అని సంకల్పిద్దాము. అరవింద మహర్షి దేశ స్వాతంత్య్రం వచ్చిన రోజున ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాటలు ఒకసారి గమనిద్దాం.‘‘భారతదేశం స్వాతంత్రం సాధించింది. కాని సమగ్రతను పొగొట్టుకొంది, బీటలు వారిన వికలమైన స్వాతంత్య్రం మాత్రమే సిద్ధించింది. హిందువులు ముస్లింలు అంటూ రగిలిన పాతకాపు మత విభేదాలు కరుడుకట్టి దేశాన్ని విభజింపచేసే శాశ్వత రూపాన్ని సంతరించుకొన్నాయి. పరిణామము శాశ్వతం కాదనీ, ఇదొక తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని కాంగ్రెస్, జాతి  గ్రహిస్తాయని ఆశిద్దాం. ఇది శాశ్వతమైతే భారతదేశం బలహీన మవుతుంది. భౌతిక కలహాలు సంభవించవచ్చు. ఏదో కొత్త దాడి, విదేశీ దురాక్రమణ కూడా సంభవించవచ్చు. ప్రభావం క్రమంగా తగ్గటం వల్ల, శాంతి సహృద్భా వము అవసరం అన్న అవగాహన పెరగటం వల్ల అవసరమైతే ఒక ఒడంబడిక ద్వారానైనా సరే కలిసి పనిచేయవలసిన నిత్యావసరము రావటం వల్ల దేశ విభజన అంతంకావాలి. కారణాల వల్ల సమైక్యత ఏదో ఒక రూపంలో రావచ్చు. రూపానికి ఆచరణ యోగ్యత ఉంటుంది. కాని అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యత  ఉండదు. ఏమైనా ఎట్లాగైనా దేశ విభజన పోతుంది. పోవాలి. లేకపోతే భారత్ భవిష్యత్తు చాలా దెబ్బతింటుంది. విఫలం కూడా కావచ్చు. అది జరగకూడదు విషయాను పదేపదే మననం చేసుకుంటూ ఉజ్వల భారత భవిష్యత్తుకు అందరం సంకల్పిద్దాము.

పాకిస్థాన్ ప్రత్యక్ష యుద్ధంలో భారత్తో గెవటం కష్టం కాబట్టి నిరంతర దాడు చేయటానికి ఉగ్రవాదును ఉసిక్పొుతున్నది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదు చేసిన 10 అతి క్రూరమైన దాడుగా పేర్కొనవచ్చు.
1. 26/11 ముంబయిలో జరిగిన దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 293 మంది క్షతగాత్రులైనారు.
2. 12 మార్చి 1993లో ముంబయిలో వరుస  పెలుళ్ళు  జరిగాయి. దావూద్ ఇబ్రహీం మొదలైనవాళ్ళు దాడులకు కారణం. దాడిలో 257మంది ప్రాణాలు కోల్పోగా 713 మంది తీవ్రగాయాల పాలైనారు.
3.24 సెప్టెంబర్ 2002 నాడు గుజరాత్లోని  అక్షరధామంపై జరిగిన దాడి, దాడిలో  31 మంది పౌరులు  చనిపోగా 80 మంది తీవ్ర గాయాలపాలైనారు.
4. 29 అక్టోబర్ 2005 ఢల్లీలో వరుస బాంబు      పేలుళ్ళు జరిగాయి.  దాడిలో 60 మంది ప్రజు ప్రాణాలు కోల్పోగా  40 మంది క్షతగాత్రులైనారు! దేశ రాజధాని కూడా సురక్షితంగా లేకుండాపోయింది.
5. 11 జూలై 2006 ముంబయిలో రైళ్ళను పేల్చివేసే ప్రయత్నం జరిగింది. దాడిలో 210 మంది ప్రాణాలు కోల్పోగా 715  మంది గాయాపాలైనారు.
6. 13 మే 2008 సంలో జైపూర్లో బాంబుదాడులు జరిగాయి. దాడులో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. 210 మంది గాయాపాలైనారు.
7. 30 అక్టోబర్ 2008 సం అస్సాంలో వరుస పుేళ్ళు జరిగాయి. దాడులో 81 మంది  ప్రాణాలు కోల్పోగా  470మంది క్షతగాత్రులైనారు.
8. 3 డిసెంబర్ 2001 భారత పార్లమెంట్పై దాడి జరిగింది. దాడిలో 6 మంది పోలీసు ముగ్గురు పార్లమెంట్ స్టాఫ్ ప్రాణాలు కోల్పోయారు.
9. 14 ఫిబ్రవరి 1998లో ఎల్.కె. అద్వానీ క్ష్యంగా కోయంబత్తూరులో వరుస బాంబు పేలుళ్ళు జరిగాయి.  పేలుళ్ళలో 60 మంది ప్రాణాలు కోల్పోయి 20 మంది గాయాల పాలైనారు.
10. అక్టోబర్1 2001 జమ్మూకాశ్మీర్ అసెంబ్లీపై బాంబుదాడి జరిగింది. దాడిలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.