ఇంకెన్నాళ్లీ విద్వేషాలు?

తెలుగువారికి రెండు రాష్ట్రాలు,  ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్న సంతోషం  ఇంకా యేడాది కూడా కాలేదు. రెండు ప్రభుత్వాల వైఖరి పోటాపోటీ వ్యూహాలు, అంతకుమించి కేసు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. నిజానికి పార్టీ పరంగా చూస్తే టీఆర్ఎస్, టీడీపీ మధ్యే అధిపత్య పోరు కాగా... తెంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో ఉండటంతో వ్యవహారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరాటంలా తయారైంది. ఫలితంగా ఎవరి అనుకూల ప్రకటనలు వారు చేసుకుంటున్నారు. అధికారులను అడ్డుపెట్టుకొని రాజకీయ వికృత క్రీడ సాగిస్తున్నారు. మొత్తానికి వ్యవహారం తెలుగు ప్రజల మనోభావాల మధ్య చిచ్చు పెట్టేదిగా ముందుకు సాగుతోంది.
విభజన జరిగినప్పటినుంచీ పంపకాలు, కేటాయింపుల్లో మాత్రం సర్దుబాటు ధోరణి వ్యక్తం చేయని ప్రభుత్వాలు.. వీలైనప్పుడల్లా కయ్యానికే కాలు దువ్వుతున్నాయి. పైగా అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలుగా, ఆత్మగౌరవ సమస్యుగా చిత్రీకరిస్తూ ప్రజలకు కూడా ఇందులో  పాత్ర కల్పించేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ వాగ్బాణాలు వదలడం... ఢల్లీలో వెళ్లి కేంద్రం సమక్షంలో చర్చలంటూ పట్టుబట్టడం యేడాది కాలంగా సర్వసాధారణంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆస్తులు, అప్పులు, పంపకాలు, కేటాయింపు సామరస్యపూర్వకంగా... ఉమ్మడి అభిప్రాయాలను  గౌరవిస్తూ  పరిష్కరించు కోవాల్సిన అవసరం ఉండగా... నాయకులు మాత్రంఎవరికి వారే... యమునా తీరేఅన్న మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా తెలుగు ప్రజల మధ్య ఒక లోతైన అగాధం ఏర్పడుతున్నది.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెలుగు చూసిన ఓటుకు నోటు కేసుతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారశైలి రచ్చకెక్కింది. కేసులో రేవంత్రెడ్డి  ప్రత్యక్షంగా  పట్టుబడగా... ఏపీ సీఎం  చంద్రబాబు  నాయుడు  వెనుక ఉండి నడిపించారంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రచారం  చేసింది.  చంద్రబాబు  గొంతుగా చెబుతున్న ఆడియో టేపునూ బయటపెట్టింది. ఏకంగా  ముఖ్యమంత్రే లక్ష్యంగా పక్క  రాష్ట్ర ప్రభుత్వం పావులు కదపడాన్ని... ఆంధ్రప్రదేశ్ సర్కారు తీవ్రంగా పరిగణించింది. పోటీగా ఏపీలో కేసీఆర్పై ఆయా సందర్భాల్లో నమోదైన 87 కేసులను తవ్వితీసింది. అంతేకాదు... కేసులను ఆగమేఘాల మీద సీఐడీకి అప్పగించింది కూడా. తమకు ఏదైనా హాని తలపెడితే.. తామేంటో చూపిస్తామన్న స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు మానసికంగా ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కేసులో తెంగాణ ప్రభుత్వం నోటీసులు ఇవ్వబోతుందన్న ప్రచారంతో రెండుమూడు రోజులు హైదరాబాద్లో తీవ్ర ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. అటు.. ఆత్మరక్షణలో బడ్డ టీడీపీ పార్టీతోపాటు... సీఎంకు రక్షణగా, మంత్రులకు రక్షణగా ఏపీ ప్రభుత్వం తమ బలగాలను దింపింది. మంత్రుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇంకా నిత్యం విమర్శ ల జోరు కొనసాగుతూనే ఉంది.
తెలుగు రాష్ట్రాల మధ్య రగడతో మీడియా కూడా రెండుగా చీలిన సందర్భం గోచరిస్తోంది. పత్రికలు తిరగేసినా..  టీవీ  చూసినా... ఎందులో  వచ్చింది  వాస్తవమో,  దేన్ని పరిగణనలోకి తీసుకోవాలో తెలియక సాధారణ పాఠకులు, ప్రేక్షకులు అయోమయంలో పడిపోతున్నారు. తెలంగాణ అనుకూల పత్రికల్లో వస్తున్న వార్తలు, ఆంధ్రప్రదేశ్ అనుకూల మీడియాలో ప్రసారమవుతున్న వార్తల్లో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చివరకు సెక్షన్`8 విషయంలో కేంద్రాన్నీ మధ్యలోకి దింపింది. వర్గం మీడియా. ఒకే వార్త రెండు భిన్న పత్రికల్లో రెండు విభిన్న పార్శ్వాల్లో వస్తుండటంతో ఏది వాస్తవమో   తెలియక   జనం  జుట్టు పీక్కుంటున్నారు. మీడియాలో వస్తున్న గందరగోళ సమాచారానికి ముగింపు పలికేలా... కేంద్రం జోక్యం  చేసుకోవాని  ఎవరికి   వారు అంటున్నారు. కేంద్రం ప్రత్యక్ష జోక్యానికి సిద్ధంగా లేదు.
రాష్ట్రం విడిపోక ముందు రాజకీయపార్టీలు ప్రజలను ఎలా పావుగా వాడుకున్నాయో.. ఇప్పుడు విభజన జరిగిన తర్వాత కూడా వాటి వ్యవహారశైలి అలాగే కొనసాగుతున్నదని విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు.  ఇప్పటికైనా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సమసిపోయి సామరస్యం నెలకొనాలని ఆశిద్దాం. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఐకమత్య భావన పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉంది.
- హంసిని సహస్ర సాత్విక