సద్గురు శివానందమూర్తి గారు శివైక్యం చెందారు



భారతీయ పరంపరలోని (1) బ్రహ్మచర్యా శ్రమము (2) గృహస్థాశ్రమము   (3) వానప్రస్థా శ్రమము (4) సన్యాసాశ్రమము నాలుగు ఆశ్రమాలలో జీవనం  సాగించి చరితార్థులైన సద్గురు శివానందమూర్తిగారు జూన్ 9 రాత్రి శివైక్యం చెందారనే వార్త సనాతనధర్మ భక్తులందరిని శోక సముద్రంలో ముంచింది. భారతదేశంలో ఋషి పరంపర గురించి మనం చదువుకొన్నాము. ఋషి పరంపరకు ప్రతీకగా  సద్గురు శివానందమూర్తిగారు మన కళ్ళముందు జీవించారు.
సద్గురు శివానందమూర్తిగారు దైవభక్తి, దేశభక్తితో సమ్మిళితమైనవారు. రెండు వేర్వేరుగా వారు ఎప్పుడు చూడలేదు. దేశ క్షేమము కోసము మన శాస్త్రాతలో చెప్పిన యజ్ఞ యాగాదును క్రమ పద్ధతిలో శాస్త్రోక్తంగా నిర్వహించినవారు సద్గురు శివానందమూర్తి గారు. దేశంలో జన్మించిన అనేకమంది   మహా పురుషులు దేశ పరిస్థితులపై అవగాహన కొరకు దేశమంతాచుట్టి వచ్చారు, అదే ప్రేరణ వారి జీవితాలను మార్చి వేసిందని. చరిత్రలో మనం చదువుకొన్నాము. ఆది శంకరాచార్య, స్వామి వివేకానంద దేశమంతా తిరిగి దేశ ప్రజలను జాగృతం చేయటం, దేశ, ధర్మ సంస్కృతులను కాపాడుకోవటం మనందరి కర్తవ్యమని ప్రజలకు బోధించి సనాతన ధర్మం వైపు నడిపించారు. అటువంటి పరంపరకు చెందినవారు శివానంద మూర్తిగారు.
సద్గురు శివానందమూర్తిగారు 1928 సం డిశంబరు 20 తేదీ రాజమండ్రిలో జన్మించారు. విద్యాభ్యాసము పూర్తి అయిన తరువాత పోలీసు శాఖలో ఆఫీస్ అసిస్టెంట్గా చిన్న ఉద్యోగంలో చేరి డి.జి.పి.కి కార్యదర్శిగా ఉన్నత పదవిలో పని చేసారు. 1951 సం లో వివాహం అయ్యింది. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తలు. పదవీవిరమణకు నాలుగు సంకు ముందుగా అంటే 1982 సం స్వచ్ఛంద పదవీ విరమణచేసి ఆధ్యాత్మిక సాధన చేసేందుకు విశాఖపట్టణానికి 36 కి.మీ. దూరంలో ఉన్న భీమిలి గ్రామం చేరారు. భీమిలి కేంద్రంగా వారి ఆధ్యాత్మిక జీవనం ప్రారంభమైంది. 1982 సం నుండి కుటుంబ బంధనా నుండి క్రమంగా బయటపడి వానప్రస్థ జీవనం గడిపారు. కొద్ది సంకు శైవ పీఠానికి అధిపతులుగా బాధ్యతలు కూడా స్వీకరించారు. సికింద్రాబాద్లోని శ్రీశ్రీశ్రీ శంకరాచార్యపీఠానికి అధిపతిగా ప్రభుత్వం నియమించింది. శ్రీ శివానందమూర్తి అనేక పత్రికలో వ్యాసాలు వ్రాశారు. సుపథ అనే ద్వైమాసిక పత్రికను తన ప్రణాళికకు అనుగుణంగా నడిపించుతూ వచ్చారు.  ఆంగ్లంలో, తెలుగులో అనేక గ్రంథాలు రచించారు. సమాజానికి అవసరమైన గ్రంథాల ప్రచురణకు ప్రోత్సహించారు, సహకరించారు.
దేశహితంకోసం 1991 మే 3 భీమిలిలో యజ్ఞం నిర్వహించారు. తదుపరి దేశంలో  ఉన్న అన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు, ముఖ్యమైన శక్తి పీఠాలు దేశసరి హద్దులో, మారుమూల వనవాసీ క్షేత్రాలలో నాలుగువందలకు పైగా యజ్ఞ యాగాదు నిర్వహించారు.  కళ్యాణాశ్రమానికి కూడా అడదండలందించారు. దేశంలో పని చేస్తున్న హిందూ సంస్థలన్నింటితో సన్నిహిత సంబంధాలు ఉండేవి. సికింద్రాబాద్లో బైసన్పోలో  గ్రౌండ్లో  షుమారుగా  ఒక లక్షమందితో జరిగిన సంఘ కార్యక్రమంలో శ్రీశివానందమూర్తి అధ్యక్షులుగా పాల్గొన్నారు. నాటి సర్సంఘచాలకులు శ్రీ రజ్జూభయ్యా   సభలో ప్రధాన వక్త. విద్యార్థి దశలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘంతో సంబంధం ఉన్నదని, పూ గురూజీని  కలిసినట్లుగా పూ శ్రీ గురూజీ జన్మశతాబ్ది ఉత్సవాల సందర్భంగా వరంగల్లో జరిగిన కార్యక్రమంలో చెప్పారు.  స్వాతంత్య్రం పొందిన తర్వాత మనదేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయంలో మన నాయకులెవరికీ సరైన కల్పన లేదని, కేవలం శ్రీ గురూజీకి మాత్రమే విషయంలో సమగ్రమైన కల్పన ఉన్నదని  తాను  గ్రహించానని    సభలో వివరించారు.     విధంగా   సద్గురు శివానందమూర్తి గారు దేశహితం కోసం ఆధ్యాత్మికజీవనం గడిపిన మహాత్ములు.
సందర్భంగా వారు పదే పదే చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకొందాము. మన హిందూ సమాజం సమైక్యమైతేనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. దాని కోసం మనము కృషి చేయాలి. దిశలో దేశంలోని అన్ని సాంప్రదాయాలకు చెందిన పెద్దలు,  పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ పరస్పర అవగాహనతో కలిసి పని చేయాలి. అదే సనాతన ధర్మ వ్యాప్తికి ఎంతో తోడ్పడుతుందని వారి ఆకాంక్ష.  ఆకాంక్ష సాధనకు కృషి చేయటమే వారికి మనం సమర్పించగలిగిన నిజమైన నివాళి.