భళా కరియా..


రాజకీయ రంగం ఎంత కలుషితమైపోయిందంటే భారత ప్రజలకు రాజకీయ రంగం అన్నా, రాజకీయ నాయకులన్నా ఏవగింపు ఏర్పడింది. ఇటువంటి కాలుష్య భరతమైన వాతావరణంలోఊకలో గింజలాగగంజాయి వనంలో తులసి మొక్కలాగ ఒక వ్యక్తి ఉబికి పైకి వచ్చాడు. అతడే కరియాముండా, ఝార్ఖండ్ నుండి ఎన్నికయిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు. 77 సంవత్సరాల వయస్సు గల ఇతడు వరుసగా ఎనిమిది పర్యాయాలు ఎంపీగా ఎన్నుకోబడ్డాడు. గతంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన ముండా నిరాడం బరుడు, అవినీతికి ఆమడ దూరంలో ఉంటాడు. పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు తన గ్రామం (కుంతియా)లో పొలం పనులు చేస్తాడు. చంద్రావతి ఇతడి కుమార్తె. ఈమె టీచర్గా పనిచేస్తున్నప్పటికీ ఆదాయం సరిపోక పోవటం వ్ల రాంచీ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తనగ్రామం కుంతియాలో మామిడి పండ్లు అమ్ముతున్నది. ‘ పని చేస్తున్నందుకు నేనేమి సిగ్గుపడటం లేదుఅని ఆమె అంటున్నది. ఒక ఎంపీ పొలం పనులు చేయటం ఆయన కుమార్తె పండ్లు అమ్ముకోవటం వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవం.