అత్యవసర పరిస్థితిభారత ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి అధ్యాయంగా పేర్కొనదగినఅత్యవసర పరిస్థితిని విధించి 2015 జూన్ 25నాటికి 40 సంలు పూర్తి అవుతున్నది. 1975 జూన్ 25 తేది రాత్రి నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తాను ప్రధానమంత్రి పదవిలో కొనసాగటానికిగాను జాతి యావత్తును ఒక అంధకారంలోకి త్రోసి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. పత్రికా స్వేచ్చను  హరించింది.  ప్రముఖ  ప్రతిపక్ష నాయకులను జైలుపాలుచేసి అత్యంత క్రూరంగా వ్యవహరించిన శ్రీమతి ఇందిరాగాంధీ నియంతల జాబితాలో చేరారు. అలా చేయటంతోపాటు అత్యవసర పరిస్థితిని విధించిన కొన్ని రోజులకే రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని కూడా నిషేదించింది.
అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యం గమనించినట్లయితే అలహాబాద్ హైకోర్టు శ్రీమతి గాంధీ ఎన్నికను కొట్టివేయటము, శ్రీ జయ ప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో నడుస్తున్న సంపూర్ణ విప్లవం, మరియు గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్పార్టీ అధికారం కోల్పోవడం మొదలైనవి. అన్ని దానికి కారణమైనాయి.
చీకటి యుగంలో పత్రికపై సెన్సార్షిప్ విధించటమే కాక, ప్రభుత్వ అనుకూల వార్తలను మాత్రమే ప్రచురించాలని ఆజ్ఞాపించడం. మీసా (అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం) లాంటి క్రూర చర్యను అమలు చేస్తూ ప్రతిపక్షనాయకులను, సంఘ అధికారులను చట్టం క్రిందనే నిర్భందించటం జరిగింది.
సుమారు  19  నెలలు కొనసాగిన అత్యవసర పరిస్థితిలో సంఘం సమాజాన్ని జాగృతపరచి పోరాటం చేసిన కారణంగా పరిస్థితి తొలగిపోయింది. 1977 మార్చిలో జరిగిన లోక్సభ ఎన్నికలో ప్రముఖ కాంగ్రెస్ నాయకులతోపాటు శ్రీమతి ఇందిరాగాంధీ రాయబెరల్లీ నియోజకవర్గంలో పోటీచేసి ఓటిమి పాలయ్యారు. ఓటమి పాలైనా శ్రీమతి గాంధీ స్వయంగా ఆర్ఎస్ఎస్పై నిషేదం ఎత్తివేయటం ఒక విశేషం.
క్లిష్ట సమయంలో సంఘం నడిపిన పోరాటం ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదిగా పేర్కొనబడినది. అనేకమంది ప్రతిపక్ష నాయకులు జైలులో ఉన్న కారణంగా ప్రజలు  నిస్సహాయంగా ఉన్నారు   సమయంలో  దేశంలో  జరుగుతున్న విషయాలను ప్రజలకు తెలియజేయడమే కాక అంతర్జాతీయంగా అన్ని దేశాలకు  సమాచారం చేరవేసి శ్రీమతి గాంధీ  తప్పని పరిస్థితులలో లోక్సభ ఎన్నికలు జరిపేటట్లు చేయటంలో సంఘం విజయంసాధించింది.
భారత ప్రజలలో అధికశాతం నిరక్షరాస్యులు కావచ్చు కాని తమ వివేకంతో సరి అయిన నిర్ణయం తీసుకోగలరని 1977 మార్చిలో జరిగిన ఎన్నికలు నిరూపించాయి. శ్రీమతి గాంధీని ఓడించటమే కాకుండా జెళ్ళలో ఉన్న అనేక మంది ప్రతిపక్షనాయకులను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించిన వివేచన భారత ప్రజలది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అసత్యప్రచారాన్ని నమ్మకుండా సంఘం చేసిన సత్యాగ్రహ ఉద్యమంలో అనేక  వేలమంది స్వచ్ఛందంగా అరెస్టు అయి జైళ్ళకు వెళ్లారు. క్రూరమైన పోలీసు శిక్షను భరిస్తూ కూడా ప్రజలను చైతన్య వంతులను చేసారు.  అజ్ఞాతంగా ఉంటూ అనేక వందలమంది  కార్యకర్తలు అత్యంత క్లిష్ణ  పరిస్థితులు  ఎదుర్కొంటూ  కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి చేసిన ఉద్యమం భావితరాలకు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోడానికి కావలసిన స్ఫూరిని ఇచ్చే విధంగా చేయడంలో వారు చేసిన ఉద్యమం ప్రముఖంగా పేర్కొనబడినది. సంఘం చేసిన సత్యాగ్రహా కారణంగా అజ్ఞాతంగా చేసిన పోరాటాల కారణంగా శ్రీమతి గాంధీ ఎన్నికలు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈరోజు వరకు అత్యవసర పరిస్థితి విధించిన వారి వారసులు కాని, కాంగ్రెసుపార్టీ కాని తాముచేసిన పనికి పశ్చాతాపం ప్రకటించక పోవటం గమనార్హం. ప్రజాస్వామ్యంలో ఎల్లపుడూ జాగురూకతలో ఉండాలని సందర్భం మనకు తెలియజేస్తున్నది.