మోడీ బంగ్లాదేశ పర్యటనదక్షిణాసియా దేశాలో గట్టి సంబంధాలు కలిగి యుండడంలో భాగంగా భారత ప్రధాని మోడీ మధ్య చేసిన 36 గం పర్యటన విజయవంతమయింది. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు యిది గొప్ప ఊతమిచ్చింది. రాబోయే రోజుల్లో చైనావలె బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాల్సివుంది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో  కలిసి మోడీ, 1974లో యుజీజ్`ఇందిర  చేసుకొన్న భూ సరిహద్దు వొప్పందాన్ని ఇప్పుడు ఖరారు చేశారు. దీనివల్ల ఇరు దేశాలో  సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు తమ జాతీయత ఏంటో తెలియవచ్చింది.  సరిహద్దు తీవ్రవాదానికి చెక్పెట్టినట్టయింది. వ్యాపార లావాదేవీల్లో వున్న అసమతుల్యతలను తొలగించేందుకు మోడీ పర్యటన దోహదపడిరది. భారత్ బంగ్లాదేశ్‌కు చేసే ఎగుమతుల విలువ 15 బిలియను డాలర్లు కాగా, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు దిగుమతులు క్షీణించాయి. చైనాకు బంగ్లాదేశ్ నుంచి ఎగుమతులు పెరిగాయి. పరిస్థితి మారేందుకు మోడీ పర్యటన దోహదపడింది.  దీనితోపాటు రవాణా ఛార్జీలు కూడా పెంచుతూ భారత్, బంగ్లాదేశ్ ఒప్పందం చేసుకున్నాయి.  ఇరు దేశాల మధ్య సముద్రమార్గం, రైల్వేమార్గం, విద్యుత్ వంటి విషయాలపై వొప్పందాలు కుదిరాయి. బంగ్లాదేశ్‌కు మోడీ భారీగా సహాయం ప్రకటించారు. తీస్తా జలాల విషయమై యింకా వొప్పందం కుదరాల్సివుంది.
సరిహద్దు వొప్పందం ప్రకారం భారత్‌కు 7,110 ఎకరాలు (బంగ్లా భూభాగంలో), బంగ్లా దేశ్‌కు 17,160 ఎకరాలు (భారత భూభాగంలో) లభిస్తాయి. భూభాగం భారత్‌లో అస్సాం, పశ్చిమబెంగాల్, మేఘాలయా మరియు త్రిపుర రాష్ట్రాలో వున్నది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువు మైనారిటీలుగా దుర్భరజీవితం గడుపుతున్నారు. హిందువుల మీద దాడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.  1947లో 31% జనాభా వున్న హిందువులు నేడు 9% అయ్యారు. బంగ్లాదేశ్ హిందువులకు భారత పౌరసత్వం యిచ్చే విషయమై కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పరిశీలిస్తున్నది.