మానస సరోవర యాత్రహిందువుల ఆధ్యాత్మిక జీవులు, ‘‘కాశీ ` రామేశ్వరం ‘‘చార్ధామ్యాత్రలాగానే వారికి అతి ముఖ్యమైన యాత్ర ‘‘కైలాసం ` మానస సరోవరంయాత్ర కూడా. వివిధ చారిత్రక కారణాలతో మనదైన మానససరోవరం ప్రస్తుతం చైనా వారి ఆక్రమణలో ఉన్నది. ఎంతో వ్యయప్రయాసలతోకూడి దుర్గమమైన మార్గం  గుండా ప్రయాణం చేస్తూ మన వారు యాత్ర చేస్తూ ఉంటారు. కొంతమంది దారిలోనే చనిపోతారు. ఇటీవల నరేంద్రమోడీ నాయకత్వాన ఏర్పడిన ప్రభుత్వం చర్యలు  మరియు మోడీ చైనా సదర్శించినపుడు, చైనా అధ్యక్షుడు జీజిన్పింగ్తో జరిపిన చర్చలు, నెలకొల్పిన సత్సంబంధాల ఫలితంగా, ఒక క్రొత్త మార్గం గుండా మానససరోవర యాత్ర చేసే అవకాశం మనకు లభించింది.  ‘‘నథూలాపాస్నుండి బయులుదేరే 1,500 కిలో మీటర్ల మార్గం ప్రకృతిరమణీయతతోకూడి, సుఖవంతం, సురక్షితంగా ఉంటుంది. ఒక వారం క్రిందట 43మందితో కూడిన బృందం తరుణ్విజయ్ (ఎంపి) నాయకత్వాన యాత్రకు నథూలాపాస్ నుండి బయుదేరింది. చైనాలో ప్రవేశించగానే టిబెట్టువారు ‘‘ఖాదాఅనే ఒక అంగవస్త్రంతో యాత్రీకులను సన్మానించారు. బృందంలో భారతరాయబారి కార్యాలయానికి చెందిన ముగ్గురు సభ్యులు కూడా ఉన్నారు. చైనా రాయబారి ‘‘లీమాట్లాడుతూ ‘‘హిందువుల భక్తి ప్రపత్తును మేము గౌరవిస్తాము వారికి అన్ని విధాలా సహకరిస్తాముఅన్నారు.