తాజ్ మహల్ ను శివాలయంగా ప్రకటించండితాజ్ మహల్ ను వెంటనే 'శివాలయం'గా ప్రకటించాలనీ, అక్కడ ఉన్న బొందల గడ్డలను తొలగించాలనీ, మహమ్మదీయుల కార్యకలాపాలను వెంటనే నిలువరించాలనీ ఆగ్రా నగర సివిల్ కోర్టులో ఒక వ్యాజ్యం దాఖలైంది. ఆగ్రాకు చెందిన 6గురు న్యాయవాదులు సివిల్ కోర్టులో కేసు వేశారు. తాజ్ మహల్ గా వ్యవహరించబడుతున్న కట్టడం నిజానికి 'తేజో మహాలయం' అనే ఒక శివాలయం. ఇక్కడి అధిష్ఠాన దేవత 'అగ్రేసర మహాదేవుడు'. ఆ కారణంగానే నగరానికి 'ఆగ్రా' అనే పేరు వచ్చింది. హిందువులు తేజోమహాలయంలో పూజలు చేసుకునే అవకాశం కల్పిస్తూ ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అయితే కోర్టు ఆ వ్యాజ్యాన్ని సున్నితంగా తిరస్కరించింది.