ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా భాజపా
భారతీయ జనతాపార్టీ (భా..పా.) సభ్యుల సంఖ్య ఎనిమిదికోట్ల ఎనబది లక్షలకు చేరుకోవడంతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎనిమిది కోట్ల అరువది లక్షల సభ్యులతో ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాను భా..పా. అధిగమించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భా..పా.కు అతి ఎక్కువమంది సభ్యులు ఉన్నారు. 2017 సంవత్సరంలో జరగబోయే ఎన్నికలలో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న భాజపాకు ఇది ఒక శుభపరిణామం.