‘‘గోశాలతో ఆదర్శగ్రామంగా మారిన భగవత్‌గడ్‌సంఘ స్వయంసేవకులు క్షేత్రంలో ఉన్నా, గ్రామంలో ఉన్నా రంగానికి ఆగ్రామ రూపు రేఖలు మారడానికి కారకులౌతారు. స్వీయ ప్రేరణతో సమాజ ఉన్నతికి సంస్కారం ` సేవా ` సమర్పణ భావనతో అంకితమౌ తున్నారు. సంఘ స్వయంసేవకులు తమ`తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా స్వయం సమృద్ధి గ్రామాలుగా తీర్చిదిద్దుటలో తన`మన`ధన రూపంలో నిమగ్నులై వన్నెతీసుకువస్తున్నారు. రాజస్థాన్లోని సకాయి మాధోపూర్ జిల్లా యొక్క భగవత్గఢ్లో జరిగిన మార్పు మచ్చుకొక ఉదాహరణ మాత్రమే.
గ్రామంలో వ్యర్థంగా తిరుగుతున్న ఆవుల వల్ల  గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతూ`సమస్యగా భావించసాగారు భగవత్గఢ్ వాసులు. గ్రామస్థులంతా గ్రామపెద్దతో చర్చించి ఊరు మీదబడ్డ ఆవుల మందను దూరంగా అన్య ప్రాంతాల్లో  కాని  అడవుల్లో కాని వదిలేసి రావాలని నిశ్చయించారు. సమయంలో బద్రిలాల్శర్మ అనే ఒక స్వయంసేవక్ కూడా అక్కడే ఉన్నాడు. చర్చ తీర్మానం విని మనమే మన గ్రామంలో ‘‘ఒక గోశాల ఎందుకు ప్రారంభించకూడదు? గోశాల వలన కులుగు ప్రయోజనము వివరిస్తు ప్రతిపాదన చేసాడు.  అతని ప్రతిపాదనను అక్కడ ఉన్న అందరు అంగీకరించారు. విధంగా గోశాల ప్రారంభ మయిన కారణంగా గోఆధారిత సేంద్రియ వ్యవసాయం, ఎరువుల ఉపయోగం జరిగింది. 12,13 రూకు అమ్మే లీటరు పాలు వారిప్పుడు ప్రభుత్వ డెయిరీ సంగ్రహణ కేంద్రం ద్వారా లీటరు 35-40 రూ విక్రయిస్తున్నారు. అంతకుముందు గ్రామస్థులో అధికులు ఋణ గ్రస్థులుగా ఉండే వారు. స్వయంసహాయక బృందాలు, పొదుపు సంఘాలు తెరువబడినాయి. వాటిని బ్యాంకుతో జోడించబడినాయి. వీటన్నింటితో ఆగ్రామం నేడు వృద్ధి చెందింది. 
సేద్`సహకార్వడ్డి`వ్యాపారస్థుల ముందు నీ బాంచెన్దొర లాంటి మానసిక దౌర్భ్యస్థితి నుండి బయటపడి పైసలు పొదుపు చేసే స్థాయికి ఎదిగారు.  ఆవును కొని`పోషించి`పూజించే మానసిక ప్రవర్తనకు  నాంది  పలికారు.   గ్రామంలో శిధిలావస్థలో ఉన్న దేవాయాల జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టాయి.  శివాలయంకు ట్రస్టు ఏర్పడి శక్తి కేంద్రంగా మార్చబడింది. హనుమంతుని దేవాలయం కూడా పునరుద్ధరణ కావింపబడి ప్రదక్షణలో హనుమాన్ చాలీసా పారాయణం   ధూపదీప   నైవేద్యాలతో ‘‘సామూహిక హారతిప్రారంభమయ్యాయి.  దాదాపు 200 మంది హారతిలో పాల్గొంటారు. ‘‘హనుమాన్శక్తి జాగరణ కేంద్రంగా వివిధ చైతన్య కార్యక్రమాలో గ్రామస్థులంతా కుల, మత, వర్ణ, వర్గ వైషమ్యా లన్నింటిని మరిచి కలిసి`మెలిసి సామూహికంగా కార్యక్రమాలో పాల్గొంటున్నారు. భగవత్గఢ్ ఆదర్శ గ్రామం   ‘‘భగవంతుని గఢ(నివాసం)గా తీర్చిదిద్దబడింది.