గిల్గిత్‌`బాల్టిస్తాన్‌లను కబ్జా చేసిన పాక్


గిల్గిత్`బాల్టిస్తాన్పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉత్తర ప్రాంతంలో ఉన్నది. వాస్తవానికి 1948లో గిల్గిత్`బాల్టిస్తాన్ జమ్మూకాశ్మీర్లో అవిభాజ్యంగా ఉండేది. మహారాజ హరిసింగ్ కాశ్మీర్ను భారత దేశంలో విలీనం చేస్తూ విలీనపత్రంపై సంతకం చేయడం వల్ల గిల్గిత్`బాల్టిస్తాన్ కూడా భారత దేశంలో అవిభాజ్య అంగంగా ఉంది. కానీ ఆనాటి జమ్మూ`కాశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా తన ఆధిపత్యాన్ని వ్యతిరేకించే ముస్లిం వర్గాలు జమ్మూకాశ్మీర్లో ఉండకూడదని చేసిన ప్రయత్నాలు, దానికితోడు పాకిస్తాన్ కుట్ర వల్ల ఇప్పుడు భూభాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం గిల్గిత్` బాల్టిస్తాన్ ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి వేరుచేసి నార్తన్ ఏరియాస్ పేరుతో వ్యవహరిస్తున్నది. గిల్గిత్`బాల్టిస్తాన్ పాకిస్తాన్ అధికార మ్యాప్లో ఉండదు. అందువ్ల పాకిస్తాన్ రాజ్యాంగంలో ఉన్న హక్కు, అధికారాలు ఏవి గిల్గిత్` బాల్టిస్తాన్కు వర్తించవు. కానీ పాకిస్తాన్ కబ్జాలో ఉంది. పాకిస్తాన్ అక్కడి వనరులను క్లొగొడుతుంది. నీరు, ఖనిజ సంపద తరలిస్తుంది. కానీ అక్కడి ప్రజల కొరకు ఎటువంటి ప్రభుత్వ సేవలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కాని చేపట్టటం లేదు. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ప్రాంత నాయకుల గొంతు నొక్కేస్తున్నారు. ప్రజలపై ప్రభుత్వ దమన కాండలు జరుగుతున్నాయి. ప్రాంతంలో శాంతి భద్రతలు, నేర విచారణలు నామమాత్రంగానే ఉన్నాయి.
చాలా ప్రపంచదేశాలకు వాస్తవాలు తెలియదు. అంతేకాదు, భారతదేశ వాసులకు కూడా చాలామందికి గిల్గిత్`బాల్టిస్తాన్ వాస్తవవిషయాలు తెలియవు. విషయమై అంతర్జాతీయంగా వాస్తవాలను తెలియచేసి చైతన్య పరచడానికి అమెరికా కేంద్రంగా ‘‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ గిల్గిట్పాకిస్తాన్ సంస్థను నిర్వహిస్తూ దానికి డైరెక్టర్గా ఉన్న ప్రొఫెసర్ సంగె హస్నన్ సెరింగ్ గారు ఏప్రిల్ 25,26 తేదీలో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యా యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. అదేరోజు భద్రుకా కాలేజ్ ఆడి టోరియంలో అవగాహనా సదస్సులో పాల్గొని ప్రసంగించారు. సమావేశంలో జమ్మూకాశ్మీర్ స్టడీ సెంటర్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, ఉస్మానియా విశ్వవిద్యాయం మాజీ వైస్చాన్సర్ ప్రొఫెసర్ తిరుపతిరావుగారు, కార్యదర్శు శ్రీ ఎన్.వి.కె. ప్రసాద్, మరియు శ్రీ రాకా సుధాకర్ పాల్గొన్నారు.